Tamil Nadu Shocker: మొదటి భార్యతో వెళ్లిన భర్త, తనకు వీడియో కాల్ చేయలేదని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న రెండవ భార్య

తన భర్త మొదటి భార్యతో కలిసి వేరే రాష్ట్రానికి వెళ్లడంతో రెండున్నర ఏళ్ల బిడ్డను విడిచిపెట్టి మహిళ అతని రెండవ భార్య ఆత్మహత్య చేసుకుంది.

Representative image. (Photo Credits: Unsplash)

Chennai, May 9: తమిళనాడులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తన భర్త మొదటి భార్యతో కలిసి వేరే రాష్ట్రానికి వెళ్లడంతో రెండున్నర ఏళ్ల బిడ్డను విడిచిపెట్టి మహిళ అతని రెండవ భార్య ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోయంబత్తూరు సమీపంలోని గణపతి వీధికి చెందిన రఘుపతి (38) వ్యాపారి. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కోయంబత్తూరుకు చెందిన దివ్యభారతి(31)ని రఘుపతి 2వ వివాహం చేసుకున్నాడు. వీరికి రెండున్నర ఏళ్ల కుమార్తె ఉంది. రఘుపతి కొద్ది రోజులు భార్య ఇంట్లోనూ, కొన్ని రోజులు దివ్యభారతి ఇంట్లోనూ ఉండేవాడు.

కూర వండి అన్నం వండలేదని భార్యను కిరాతకంగా చంపిన భర్త, ఒడిషాలో దారుణ ఘటన వెలుగులోకి..

రఘుపతికి అప్పటికే పెళ్లయిందని, భార్య, పిల్లలు ఉన్నారని దివ్యభారతికి తెలిసినా..ఆమె తన భర్తను మొదటి భార్య ఇంటికి వెళ్లవద్దని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరి మధ్య తరచూ కుటుంబ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రఘుపతి తన మొదటి భార్య, పిల్లలతో కలిసి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. నదిలో పడిన బస్సు.. 15 మంది మృతి.. 25 మందికి తీవ్రగాయాలు

ఈ విషయం తెలుసుకున్న దివ్యభారతి తన మొదటి భార్య పిల్లలతో కలిసి ఏపీకి వెళ్లొద్దని చెప్పి గొడవకు దిగినట్లు సమాచారం. అయితే అతను తన మొదటి భార్య, పిల్లలతో కలిసి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న దివ్యభారతి భర్తను ఎక్కడున్నావని ప్రశ్నించింది. తనతో వీడియో కాల్‌ మాట్లాడాలని.. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. అయితే రఘుపతి వీడియో కాల్‌ చేయలేదని తెలుస్తోంది. దీంతో మనస్తాపం చెందిన దివ్యభారతి సోమవారం ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.



సంబంధిత వార్తలు