Tamil Nadu Shocker: అందంగా ఉన్నాడనుకుని తన ప్రైవేట్ ఫోటోలను పంపింది, కట్ చేస్తే అతని అసలు రంగు బయటపడింది. తమిళనాడులో మోసపోయి పోలీసులను ఆశ్రయించిన మహిళ
ఓ మహిళప్రైవేట్ ఫోటోలు, వీడియోలు లీక్ చేస్తానని బెదిరించి ఆమెను డబ్బుల కోసం వేధించిన (Tech graduate tries to extort money) యువకుడి (29)ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Chennai, Dec 20: తమిళనాడు రాష్ట్రంలో దారుణ ఘటన (Tamil Nadu Shocker) చోటు చేసుకుంది. ఓ మహిళప్రైవేట్ ఫోటోలు, వీడియోలు లీక్ చేస్తానని బెదిరించి ఆమెను డబ్బుల కోసం వేధించిన (Tech graduate tries to extort money) యువకుడి (29)ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కన్నిసెర్వపట్టి గ్రామానికి చెందిన బీటెక్ గ్రాడ్యుయేట్ ఎం మనోజ్‌కుమార్‌గా గుర్తించారు. తమిళనాడులోని థేని జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బీటెక్ గ్రాడ్యుయేట్ అయిన మనోజ్‌కుమార్ మొబైల్ ఫోన్ ద్వారా బాధిత మహిళతో పరిచయం పెంచుకున్నాడు. రాజ్ అనే పేరుతో ఆమెకు పరిచయమై దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు.
ఆ మహిళను తనవైపు తిప్పుకునేందుకు ఆన్‌లైన్‌లో వేర్వేరు పురుషుల ఫోటోలను డౌన్‌లోడ్ చేసి ఆమెకు పంపాడు. నిందితుడి ఉద్దేశాన్ని పసిగట్టలేని మహిళ అతడితో స్నేహాన్ని కొనసాగించింది. తన ఫోటోలు, వీడియోలు సైతం అతనికి పంపింది. ఆమె ఈ మెయిల్ వివరాలను కూడా రాబట్టిన నిందితుడు ఆమె కాంటాక్ట్ నెంబర్లనూ సేకరించాడు. ఆపై తన ఉద్యోగం పోయిందని రూ 50,000 డబ్బు పంపాలని ఆమెను కోరాడు. దీంతో రూ 20,000 మనోజ్ ఖాతాకు ఆమె ట్రాన్ఫ్‌ఫర్ చేసింది.
మిగిలిన రూ 30,000 ఇవ్వాలని లేకుంటే ప్రైవేట్ వీడియోలు, ఫోటోలను (leak her private photos) ఆమె బంధువులు, కుటుంబసభ్యులకు పంపుతానని బెదిరించాడు. నిందితుడి ఆగడాలు భరించలేని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు మనోజ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.