Pemmasani Chandra Shekar Oath: కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పెమ్మసాని చంద్రశేఖర్, దేశంలోనే అత్యంత ధనవంతుడైన ఎంపీగానే కాదు...కేబినెట్ లోనే రిచెస్ట్ మినిస్టర్ గా పెమ్మసాని రికార్డ్
దేశంలో అత్యంత ధనవంతుడైన ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ నిలిచారు.
New Delhi, June 09: రాష్ట్రపతి భవన్‌లో నరేంద్ర మోదీ (Narendra Modi) వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీచే ప్రమాణ స్వీకారం చేయించారు. కేంద్ర సహాయ మంత్రిగా గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandra Shekar) ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీలో కూటమికి మంచి మెజార్టీ రావడం, కేంద్రంలో టీడీపీ మద్దతు చాలా ముఖ్యం అవ్వడంతో ఈ సారి టీడీపీకి (TDP) రెండు కేబినెట్ స్థానాలు దక్కాయి, అందులో పెమ్మసానికి కూడా చోటు దక్కింది. దేశంలో అత్యంత ధనవంతుడైన ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ నిలిచారు.
కేంద్ర మంత్రులుగా వరుసగా రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, జైశంకర్, కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, అశ్వనీ వైష్ణవ్, జితన్ రామ్ మాంజీ, పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో బీజేపీ అగ్రనేతలు, సీనియర్ నాయకులు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు హాజరయ్యారు.