Revanth Reddy vs Nirmala: లోక్‌సభలో హిందీ, బ్రాహ్మణ వార్, రేవంత్ హిందీ అంతతమాత్రమేనన్న నిర్మలా సీతారామన్, మీలా బ్రాహ్మణవాదిని కాకపోవడం వల్లే భాష వీక్ అన్న కాంగ్రెస్ ఎంపీ

లోక్‌సభలో హిందీ, బ్రాహ్మణ అంశాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిల మధ్య మాటల యుద్దం (Revanth vs Nirmala) నడిచింది. లోక్‌సభలో రూపాయి వేగంగా క్షీణిస్తుండటంపై వాడి వేడి చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ (Nirmala Sitharaman) మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటు చేసుకుంది.

Revanth Reddy and Niramala (Photo-File Image)

New Delhi, Dec 13: లోక్‌సభలో హిందీ, బ్రాహ్మణ అంశాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిల మధ్య మాటల యుద్దం (Revanth vs Nirmala) నడిచింది. లోక్‌సభలో రూపాయి వేగంగా క్షీణిస్తుండటంపై వాడి వేడి చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ (Nirmala Sitharaman) మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటు చేసుకుంది.

సోమవారం సభలో (Lok Sabha) రూపాయి విలువ క్షీణత, దాని కట్టడికి కేంద్రం తీసుకుంటున్న చర్యలపై ఎంపీ రేవంత్‌ రెడ్డి (Congress MP Revanth Reddy) పలు ప్రశ్నలు సంధించారు. రేవంత్ మాట్లాడుతూ..రూపాయి విలువ ఐసీయూలో ఉందని, అధికారాన్ని కాపాడుకోవాలన్న యావ తప్ప, రూపాయి పతనంపై ప్రధాని మోదీకి ప్రణాళిక ఏదీ లేదని విమర్శించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందని, 8 ఏళ్ల పాలనలో భారత కరెన్సీ విలువ రికార్డు స్థాయిలో పడిపోయిందని విమర్శించారు.

భారత్-చైనా ఘర్షణపై రక్షణమంత్రి కీలక ప్రకటన, ఈ ఘర్షణలో భారత సైనికులకు ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడి, చైనా సైనికులను సమర్థవంతంగా తిప్పికొట్టారని ప్రశంస

డాలర్‌‌తో పోల్చితే రూపాయి పతనాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలన్నారు. గతంలో రూపాయి విలువ రూ.66కి పడిపోయినప్పుడు గుజరాత్‌ సీఎంగా ఉన్న ఇదే నరేంద్ర మోదీ రూపాయి ఐసీయూలో ఉందని అన్నారని, కానీ ఇప్పుడు రూపాయి విలువ రూ.83.20ను దాటిపోయిందని తెలిపారు. 2014 ముందు వరకు దేశ అప్పులు రూ. 55,87,149 కోట్లుగా ఉంటే తర్వాతి ఎనిమిదేళ్లలో మోదీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.80,00,744 కోట్లుగా ఉందని లోక్‌సభలో ధ్వజమెత్తారు.

రేవంత్‌ ప్రశ్నలు వేస్తున్న సమయంలో స్పీకర్‌ అసహనం వ్యక్తం చేశారు. ప్రశ్నలు మాత్రమే వేయాలంటూ రేవంత్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మీకు సంబంధించిన ప్రశ్నలే వేయాలని స్పీకర్ సూచించారు. ఈ సమయంలో రేవంత్‌.. ‘మీరు మధ్యలో జోక్యం చేసుకోలేరు’అన్నారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన స్పీకర్‌ మైక్‌ కట్‌ చేశారు. అనంతరం కాంగ్రెస్‌ లోక్‌సభా పక్ష నేతను ఉద్దేశించి ‘సభ్యుడు స్పీకర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం సరికాదు. స్పీకర్‌ మధ్యలో జోక్యం చేసుకోరాదన్న వ్యాఖ్యలు సరికాదు. సభలో జోక్యం చేసుకోవడం నా అధికారం’అని స్పష్టం చేశారు.

ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా పెరిగిన రద్దీ, ప్రయాణికులు కనీసం 5 గంటల ముందుగా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాలని అడ్వైజరీ జారీ చేసిన ఇండిగో

అనంతరం స్పీకర్‌ సూచన మేరకు నిర్మల మాట్లాడారు. రేవంత్‌ వ్యాఖ్యలపై ధీటుగా స్పందించారు.ఆమె మాట్లాడుతూ.. రేవంత్‌ తెలంగాణ నుంచి వచ్చారు. ఆయన హిందీ అంతంతమాత్రంగా ఉంది. నా హిందీ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆయన అంతంత మాత్రం హిందీకి తగ్గట్టుగా నా సమాధానం కూడా అంతంతమాత్రం హిందీలోనే చెబుతా..’ అంటూ నిర్మలా ఎద్దేవా చేశారు.

నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూపాయి పతనంపై చేసిన వ్యాఖ్యలే కాకుండా అప్పటి ఆర్థిక గణాంకాలను కూడా రేవంత్‌ చెప్పి ఉంటే బాగుండేదన్నారు.అప్పట్లో ఆర్థిక రంగం మొత్తం ఐసీయూలోనే ఉందని అన్నారు. ఇప్పుడు రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం జరుగుతున్నప్పటికీ, కరోనా తర్వాత కూడా మన ఆర్ధిక వ్యవస్థ వేగంగా ముందుకు వెళుతోందని తెలిపారు. విదేశీ శత్రువుల మాదిరిగానే మన ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతుంటే అసూయ పడేవాళ్లు మన దేశంలోనూ ఉన్నారని కాంగ్రెస్‌ సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఆర్థికమంత్రి మాట్లాడిన తర్వాత సప్లిమెంటరీ ప్రశ్నలు వేసేందుకు స్పీకర్‌ మరోమారు రేవంత్‌కు అవకాశం ఇచ్చారు. దీంతో రేవంత్‌ మాట్లాడుతూ.. ‘ఆర్థిక శాఖ మంత్రి నా భాషపై వ్యాఖ్యలు చేయడం సరికాదు. నేను శూద్రుణ్ణి. నాకు స్వచ్ఛమైన హిందీ రాదు. ఆమె బ్రాహ్మణవాది అయ్యుండొచ్చు. ఆమెకు భాషపై పట్టుండొచ్చు. అందులో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు’అని అన్నారు.

ఈ వ్యాఖ్యలపై స్పీకర్‌ ఓంబిర్లా ,బీజేపీ సభ్యులు సహా, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘవాల్‌ అభ్యంతరం తెలిపారు. సభకు ఎన్నికైన వారెవరూ జాతి, ధర్మం మీద ఆధారపడి రారు. దేశ ప్రజలు వారిని ఎన్నుకొని పంపిస్తారు. ఎన్నడూ అలాంటి పదాలను ఎవరూ వాడరాదని హెచ్చరించారు. మరోసారి మాట్లాడినప్పుడు ధర్మం, జాతి అనే పదాలు రానీయొద్దు అని సూచించారు. రేవంత్‌కు మద్దతుగా మాట్లాడేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్‌ సభ్యుల్ని సభనుంచి బయటకు పంపిస్తానంటూ హెచ్చరించారు. రేవంత్‌ పద్ధతి ఏమాత్రం సరిగాలేదని, ఆయనకు సర్ది చెప్పాలని కాంగ్రెస్‌ పక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరికి సూచించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

CM Revanth Reddy At Singapore: సింగపూర్‌లో సీఎం రేవంత్ రెడ్డి...గ్రీన్ ఎనర్జీ, టూరిజం, నదుల పునరుజ్జీవనంపై సింగపూర్ విదేశాంగ మంత్రితో చర్చలు

CM Revanth Reddy: ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపేందుకు తెలంగాణ నుండి మద్దతిస్తాం...మరో రెండు హామీలను ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌తోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని వెల్లడి

Amit Shah AP Tour Details: ఆంధ్రప్రదేశ్‌కు హోంమంత్రి అమిత్ షా.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్బీడీఎం ప్రాంగణాలను ప్రారంభించనున్న షా, చంద్రబాబు నివాసంలో అమిత్‌ షాకు విందు

Meta Apologises to Indian Government: మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ కామెంట్లపై భార‌త్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన మెటా సంస్థ, మాకు ఇండియా చాలా కీల‌క‌మైన దేశ‌మ‌ని వెల్లడి

Share Now