CM Revanth Reddy: రైజింగ్ తెలంగాణ మా నినాదం, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను విస్మరిస్తున్న ప్రధాని, దేశ వ్యాప్తంగా ఓబీసీ కుల గణన జరగాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్

తెలంగాణ అభివృద్ధిపై మాకొక స్పష్టమైన విజన్ ఉందన్నారు. ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్స్.. వంటి లక్ష్యాలను నిర్ధేశించుకున్నాం అన్నారు. ఇప్పుడు మా నినాదం రైజింగ్ తెలంగాణ... చైనా ప్లస్ వన్ కంట్రీకి సరైన మార్గంగా చైనా ప్లస్ తెలంగాణ చూపిస్తున్నాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

Telangana is the ideal state for India says CM Revanth Reddy(CMO X)

Hyd, Nov 13:  అభివృద్ధి – సంక్షేమం రెండింటినీ సమతుల్యం చేసుకుంటూ తెలంగాణలో సుపరిపాలన అందిస్తున్నాం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధిపై మాకొక స్పష్టమైన విజన్ ఉందన్నారు. ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్స్.. వంటి లక్ష్యాలను నిర్ధేశించుకున్నాం అన్నారు. ఇప్పుడు మా నినాదం రైజింగ్ తెలంగాణ... చైనా ప్లస్ వన్ కంట్రీకి సరైన మార్గంగా చైనా ప్లస్ తెలంగాణ చూపిస్తున్నాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ నిర్వహించిన #ADDA కార్యక్రమంలో భాగంగా Revanth Reddy’s Rise : A Game Changer for Telangana కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో దేశ రాజకీయాలు, నియోజకవర్గాల పునర్విభజన, కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో దక్షిణాది రాష్ట్రాలకు ఎదురవుతున్న పరిస్థితులు, తెలంగాణ ఎజెండా, రాష్ట్ర సమతుల అభివృద్ధి, ప్రభుత్వ లక్ష్యాలు, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ల వంటి అనేక అంశాలపై ముఖ్యమంత్రి వివరించారు.

నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలంటే ఆ ప్రక్రియకు ప్రాతిపదిక ఏంటన్నది ముందు నిర్ధేశించాలి అన్నారు. దానిపై చర్చ జరగాలి. ప్రాతిపదిక నిర్ణయించిన తర్వాత ప్రక్రియ చేపట్టాలి. లేదంటే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవడమే కాకుండా ఉత్తరాది, దక్షిణాది అన్న వాదన తెరమీదకు వచ్చే ప్రమాదం ఉంటుందన్నారు. తెలంగాణలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించడం. సుపరిపాలన అందించడం మా విధానం అన్నారు.

తెలంగాణలో చేపట్టిన కులగణన గేమ్ చేంజర్ కాబోతోంది. సంక్షేమ ఫలాలు అసలైన అర్హులైన పేదలకు చేరాలంటే ప్రభుత్వం వద్ద సరైన గణాంకాలు ఉండాలి. అసలు గణాంకాలు లేకుంటే అసలైన అర్హులకు న్యాయం చేయలేం. అందుకే కులగణన చేపట్టాం. ఒక మైలురాయిగా మిగులుతుందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను గొర్రెలతో పోల్చిన కేటీఆర్, అతి పెద్ద గొర్రెల కొనుగోలుదారుడిని అందించినందుకు కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు అంటూ ఖర్గే వ్యాఖ్యలకు కౌంటర్

దేశవ్యాప్తంగా కూడా ఓబీసీ గణాంకాలు తేలాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాతిపదికగా రిజర్వేషన్లు అమలు జరగాలి. జనాభా లెక్కల సందర్భంగానే కేంద్రమే ముందుకొచ్చి ఓబీసీ గణాంకాలను కూడా సేకరించాలి. ఓబీసీ గణాంకాలు సేకరించడంలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరమేంటి చెప్పాలన్నారు.

ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను విస్మరిస్తున్నారు... తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవారిని గుజరాత్ కు మళ్లిస్తున్నారు అన్నారు. సెమీకండక్టర్ పరిశ్రమ అందుకు ఉదాహరణ. గుజరాత్ కు ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు. కానీ గుజరాత్ ప్రధానమంత్రి కాదు. దేశ ప్రధానమంత్రి ఒక జడ్జిలా ఉండాలి. ఆటలో రిఫరీ ఒక జట్టు తరఫున ఆడకూడదు. ఒకరి తరఫున వకాల్తా పుచ్చుకోవద్దు. ఇలాంటి పరిణామాలు దేశానికి మంచిది కాదు అన్నారు.



సంబంధిత వార్తలు

MP Raghunandan Rao: మారింది రంగుల జెండా మాత్రమే.. రైతుల బతుకుల్లో మార్పు లేదు..ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్‌ రావు సూచన

Siva Prasad Reddy Slams Chandrababu Govt: ఎంత మందిపై కేసులు పెడతారో పెట్టుకోండి, మా పోరాటం ఆగదని తెలిపిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

Telangana Horror: సంగారెడ్డి జిల్లాలో దారుణం, అందరూ చూస్తుండగానే రోడ్డుపై తల్లి, కొడుకులను కత్తితో నరికిన దుండగులు, పాతకక్షలే కారణం

Harish Rao: పీడిత వర్గాలకు అండదండగా ఉంటాం.. ఉద్యమాలు , అరెస్టులు కొత్త కాదు అని తేల్చిచెప్పిన హరీశ్‌ రావు, నరేందర్ రెడ్డి నిర్దోషిగా బయటకు వస్తారని స్పష్టం చేసిన మాజీ మంత్రి