IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలకు మూడు రోజుల పాటు వర్ష సూచన, పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం

రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో మరో మూడురోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది

AP, Telangana Weather Alert Heavy Rains To Hyderabad, IMD issues yellow alert

IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో మరో మూడురోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలుపడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

హైదరాబాద్‌ ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిసిన సమాచారం మేరకు శుక్రవారం ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాలలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. శనివారం నిజామాబాద్‌, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల వానలు కురుస్తాయని పేర్కొంది. రాష్ట్రంలోని 18 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

జరగని దాన్ని జరిగిందని పదేపదే ప్రచారం చేశారు, తప్పుడు ప్రచారం చేసిన వారిని స్వామివారే శిక్షిస్తారన్న జగన్..సనాతన ధర్మమంటే పవన్‌కు తెలుసా? అని ప్రశ్న

ఇక ఏపీలో వచ్చే రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడులో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

అటు ఏపీలోని ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. కర్నూలు జిల్లా ఆలూరులో కల్లే వాగు వంతెనపైకి వరదనీరు చేరింది. గుంతకల్లు-ఆదోని మధ్య అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు రాకపోకలు నిలిచిపోయాయి. కడప జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. కడప, పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై వాన నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక గురువారం కడప జిల్లా తుమ్మలూరులో పిడుగు పాటుకు ముగ్గురు మృతిచెందారు.