Chandrababu spreading lies says Jagan Reddy after SC order(video grab)

Hyd, Oct 4:  సుప్రీం కోర్టు తీర్పును స్వాగతించారు మాజీ సీఎం జగన్. తిరుమల లడ్డూ వ్యవహారంపై సిట్‌ తో విచారణ జరపాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించగా వేంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే మామూలుగా ఉండదు.. ఏ అధికారులు వచ్చి ఏం చేస్తారు అని తెలిపారు. తప్పుడు రిపోర్ట్‌ ఇచ్చినా.. తప్పుడు ప్రచారం చేసినా స్వామివారే చూసుకుంటారు అని తెలిపారు జగన్.

తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడిన జగన్..తిరుపతి లడ్డూకు సనాతన ధర్మాన్ని ముడిపెట్టడం ఎంత వరకు కరెక్ట్? సనాతన ధర్మమంటే పవన్ కు తెలుసా? ఒక పక్క లడ్డూ ప్రసాదాలపై తప్పుడు ప్రచారం చేస్తూ.. మరోపక్క సనాతన ధర్మం గురించి ఎలా మాట్లాడగలుగుతున్నారు? అని దుయ్యబట్టారు.

మేము ఏ తప్పు చేయలేదు కాబట్టే.. ధైర్యంగా ఆధారాలు చూపిస్తున్నాం లడ్డూపై తప్పుడు ప్రచారం చేసిన వారిని ఆ వేంకటేశ్వర స్వామి తప్పక శిక్షిస్తారు. దేవుడితో ఆటలు ఆడుతున్న కూటమి నేతలకి.. మొట్టికాయలు తప్పవు అని తెలిపారు జగన్.తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు, ఐదుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు, భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి

Here's Video:

తిరుపతి లడ్డూల విషయంలో అడ్డంగా దొరికిపోయినా చంద్రబాబుకు సిగ్గురాలేదని.. లడ్డూ వివాదంలో తన తప్పుడు ప్రచారాన్ని సమర్థించుకునేందుకు సిట్‌ను ఏర్పాటు చేశాడు. కానీ.. ఆ సిట్‌ను రద్దు చేయడం ద్వారా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు.

లడ్డూ విషయంలో నిజాలు తెలిసిన తర్వాత నేషనల్ మీడియా సైతం చంద్రబాబుని తిట్టిపోస్తోందని అయినా సిగ్గులేకుండా మళ్లీ అవే అబద్దాలను చంద్రబాబు చెబుతున్నారన్నారు. కల్తీ నెయ్యి వాడలేదని స్వయంగా టీటీడీ ఈవో చెప్తుంటే..చంద్రబాబు మాత్రం వాడారంటూ తప్పుడు ప్రచారాలే చేస్తున్నారన్నారు.