Rajouri Attack: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడి, ముగ్గురు పౌరులు మృతి, ఎనిమిది మందికి గాయాలు, రెండు వారాల వ్యవధిలో రెండో అటాక్
మరో ఎనిమిది గాయపడ్డారు. తుపాకీ తూటాలతో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ సాయంత్రం డాంగ్రి గ్రామంలోకి ఇద్దరు సాయుధులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు.
Rajouri, JAN 01: జమ్మూకశ్మీర్ రాజౌరీ జిల్లాలోని (Rajouri) ఓ గ్రామంలో జరిగిన ముష్కరులు జరిపిన దాడిలో (Terrorist Attack ) ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది గాయపడ్డారు. తుపాకీ తూటాలతో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ సాయంత్రం డాంగ్రి గ్రామంలోకి ఇద్దరు సాయుధులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. మూడు ఇండ్లపై కాల్పులు జరగ్గా.. ముగ్గురు పౌరులు (Three Killed) మరణించారు.. మరో నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న బలగాలు సంఘటనా స్థలానికి చేరుకొని సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు అదనపు డీజీపీ ముఖేష్ సింగ్ తెలిపారు. గాయపడ్డవారందరినీ ఆస్పత్రికి తరలించామన్నారు. ఉగ్రవాదుల కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు చెప్పారు.
ఘటనలో ముగ్గురు మృతి చెందారని, తీవ్రంగా గాయపడిన ఎనిమిది మందిని ఆసుపత్రికి తరలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాజౌరి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించడంతో అక్కడ గందరగోళం నెలకొంది. గత రెండు వారాల్లో జిల్లాలో పౌరులు హత్యకు గురవడం ఇది రెండోసారి. ఇంతకు ముందు డిసెంబరు 16న రాజౌరిలోని సైనిక శిబిరం వద్ద జరిగిన ఇద్దరు పౌరులు ప్రాణాలు వదిలారు.