Amit Shah On NRC: దేశంలో అక్రమ వలసదారులను ఏరివేస్తాం, హిందూ శరణార్థులకు మాత్రం భారతదేశ పౌరసత్వం కల్పిస్తాం, జాతీయ పౌర జాబితాపై కీలక వ్యాఖ్యలు చేసిన అమిత్ షా

దేశంలోకి అక్రమంగా చొరబడి ఇక్కడే నివసిస్తున్న వలసదారులను బయటకు పంపుతాం అని అమిత్ షా తేల్చిచెప్పారు, అయితే హిందూ, సిక్కు, జైన మరియు బౌద్ధ శరణార్థులకు మాత్రం భారతీయ పౌరసత్వం కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు...

Union Home Minister and BJP President Amit Shah | File Photo

Kolkata, October 01: భారతీయ పౌరసత్వానికి సంబంధించిన 'జాతీయ పౌర జాబితా'పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) మంగళవారం కీలక ప్రకటన చేశారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ఆయన, ఒక సెమినార్ లో మాట్లాడుతూ జాతీయ భద్రత కోసం NRC (National Register of Citizens) తప్పనిసరి అని పేర్కొన్నారు. ఎవరు వ్యతిరేకించినా  ఇది ఖచ్చితంగా అమలుచేయబడుతుంది, దేశమంతా అమలు పరుస్తామని స్పష్టం చేశారు.  దేశంలోకి అక్రమంగా చొరబడి ఇక్కడే నివసిస్తున్న వలసదారులను బయటకు పంపుతాం అని అమిత్ షా తేల్చిచెప్పారు, అయితే హిందూ, సిక్కు, జైన మరియు బౌద్ధ శరణార్థులకు మాత్రం భారతీయ పౌరసత్వం కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.  'నక్సల్స్ ఎరివేత' అంశంపై రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా కీలక సమావేశం...

బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్ లోకి చొరబడి పశ్చిమ బెంగాల్‌లో అనేక మంది ఓటు హక్కును కలిగి ఉన్నారని, ఈ ఓటర్లందరూ తృణమూల్ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండటంతో తమ ఓటు బ్యాంకు కోల్పోతామనే భయంతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ NRC కి సంబంధించిన సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ NRC సవరణ చట్టంపై అసత్య ప్రచారాలు చేస్తూ, వివాదాలు సృష్టిస్తున్నారని అమిత్ షా ఆరోపించారు.

ఈ ఏడాది ప్రారంభంలో అస్సాం రాష్ట్రంలో మొదటగా NRC ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. కాగా, ఆగస్టు 31న విడుదల చేయబడిన పౌరుల తుది జాబితా నుండి పెద్ద సంఖ్యలో హిందువులు సహా దాదాపు 12 లక్షల మంది బెంగాలీ భాష మాట్లాడే ప్రజలపేర్లు గల్లంతయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం "బెంగాలీ వ్యతిరేక" చర్యలు చేస్తుందని అప్పట్లోనే మమతా బెనర్జీ ఆరోపించారు. తమ రాష్ట్రంలో NRC అవసరం లేదంటూ కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తమ పౌరసత్వం కూడా రద్దవుతుందేమోనని ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.    అమిత్ షా.. బలవంతంగా హిందీని మాపై రుద్దవద్దు!

ఈ నేపథ్యంలో అమిత్ షా మాట్లాడుతూ, " NRC పట్ల బెంగాల్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు, ఈ అంశపై అసలు బీజేపీ వైఖరి ఏంటో తెలియజేయడానికి, మీలో నెలకొన్న అన్ని సందేహాలను తొలగించడానికి ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. లక్షలాది మంది హిందువులు పశ్చిమ బెంగాల్‌ను విడిచి వెళ్ళవలసి ఉంటుందని మమతా బెనర్జీ చెబుతున్నారు, ఇంతకంటే పెద్ద అబద్ధం ఇంకొకటి ఉండదు". అని అమిత్ షా వ్యాఖ్యానించారు.

దీనిపై మరింతగా వివరిస్తూ "ఈ సందర్భంగా బెంగాలీ ప్రజలందరికీ నేను భరోసా ఇస్తున్నాను, మమతా బెనర్జీ చెప్పినట్లుగా అలాంటిదేమీ జరగదు. బెంగాలీ ప్రజలకు NRC అమలు చేయబడుతుంది. అదే సమయంలో హిందూ, బౌద్ధ, సిక్కు, జైన శరణాలెవ్వరూ దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం లేదు, వారందరికీ భారతీయ పౌరసత్వం లభిస్తుందని వారందరూ కూడా మిగతా పౌరులలాగే అన్ని హక్కులను పొందుతారు". అని షా స్పష్టం చేశారు.



సంబంధిత వార్తలు