Afghanistan Earthquake: ఆప్ఘనిస్థాన్ లో భారీ భూకంపం, 1150 చేరిన మృతుల సంఖ్య, భారీగా ఆస్తి నష్టం, సహాయం కోసం ఎదురుచూపులు...

భూకంపం కారణంగా ఇప్పటివరకూ 1,150 మంది మరణించినట్లు అధికారికంగా ప్రకటన వెలువడింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

(Photo Credit: social media)

ఆప్ఘనిస్థాన్ లో మరోసారి భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా ఇప్పటివరకూ 1,150 మంది మరణించినట్లు అధికారికంగా ప్రకటన వెలువడింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

శుక్రవారం కూడా భూకంపం సంభవించడంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. మరో వైపు భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో వేల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి.