Pulwama Encounter: 2019 పుల్వామా దాడుల సూత్రధారి హతం, ఫౌజీభాయ్‌ని తుదముట్టించిన భద్రతా దళాలు, మిస్సయిన కారు బాంబులు
జైషే ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందుకున్న భద్రతా దళాలు కంగన్ ప్రాంతంలో గాలింపు చేపట్టిన క్రమంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. మృతుల్లో బాంబు తయారీలో నిపుణుడైన ఫౌజీ భాయ్ (FAUJI BHAI) అలియాస్ అబ్దుల్ రెహమాన్ కూడా ఉన్నట్టు కశ్మీర్ రేంజ్ ఐజీ విజయ్ కుమార్ (IG Vijay Kumar) తెలిపారు.
Jammu, June 3: జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా కంగన్ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను (Three Jaish terrorists killed) భద్రతా దళాలు హతమార్చాయి. జైషే ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందుకున్న భద్రతా దళాలు కంగన్ ప్రాంతంలో గాలింపు చేపట్టిన క్రమంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. మృతుల్లో బాంబు తయారీలో నిపుణుడైన ఫౌజీ భాయ్ (FAUJI BHAI) అలియాస్ అబ్దుల్ రెహమాన్ కూడా ఉన్నట్టు కశ్మీర్ రేంజ్ ఐజీ విజయ్ కుమార్ (IG Vijay Kumar) తెలిపారు. కశ్మీర్ జైషే చీఫ్ హతం, గతేడాది ఆత్మాహుతి బాంబు దాడిలో కీలక పాత్ర పోషించిన ఖారీ యాసిర్, పుల్వామా ఎన్‌కౌంటర్‌లో ఆతనితో పాటు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఇండియన్ ఆర్మీ
ఫౌజీ భాయ్ ఎన్‌కౌంటర్ భద్రతా బలగాలకు పెద్ద విజయమని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, రెహమాన్ తయారు చేసిన మూడు కారు బాంబుల్లో (CAR BOMBS) ఒకదానిని భద్రతా బలగాలు పేల్చివేయగా... మరో రెండింటి ఆచూకీ తెలియాల్సి ఉంది. బుడ్గాం, కుల్గాం ప్రాంతాల్లో ఆ బాంబులు ఉండొచ్చని, వాటి జాడ కోసం ముమ్మర తనిఖీలు కొనసాగుతున్నాయని రక్షణ శాఖ అధికారులు తెలిపారు.
పుల్వామా తరహా ఉగ్రదాడి జరగనుందనే ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. 20 కిలోల శక్తిమంతమైన ఐఈడీని మోసుకెళ్తున్న శాంట్రో వాహనాన్ని మే 27న సీజ్ చేశాయి. ఐఈడీని తరలిస్తున్న టెర్రరిస్టు సమీర్ అహ్మద్ దార్ తృటిలో తప్పించుకుపోయాడు. ఇక ఐఈడీ వాహనాన్ని తరలించడం ప్రమాదమని భావించిన బాంబు స్క్వాడ్ నిపుణులు దానిని అక్కడే పేల్చివేశారు. గతేడాది పుల్వామా వద్ద భద్రతా బలగాలపై ఆత్మహుతి దాడికి పాల్పడ్డ అదిల్ దార్‌కు సమీర్ అహ్మద్ దార్ బంధువని తేలింది. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. మరువనిదీ ఈ గాయం! పుల్వామా దాడి జరిగి నేటికి ఏడాది, అమరవీరులకు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా
ఇక హతమైన ఫౌజీభాయ్...ఇటీవల కశ్మీర్‌లో జరుగుతున్న ఉగ్రదాడులకు ఇతనే కీలక వ్యూహాకర్తగా పనిచేశారు. పాక్‌తో ఉన్న నియంత్రణ రేఖ వద్ద జరుగుతున్న అల్లర్లకు, 2019లో జరిగిన పుల్వామా దాడికి ప్రధాన వ్యూహాకర్తగా వ్యవహరించారు. పాకిస్థాన్‌కు చెందిన జైషే మొహమ్మద్ టాప్ కమాండర్‌గా ఈ ఉగ్రవాది కశ్మీర్‌లో అనేక ఆపరేషన్లు చేపట్టాడు. జైషే మిలిటరీ చీఫ్ అబ్ధుల్ రౌఫ్ అస్గర్ ఇతన్ని రిక్రూట్ చేశాడు. 2018లో పాక్ ఇతన్ని భారత్‌లోకి పంపించినట్లు తెలుస్తోంది. అంతకు మించిన దాడులు చేస్తాం!
కశ్మీర్ ఇంటెలిజెన్స్ పోలీసుల రికార్డులో ఫౌజీభాయ్‌కు పలుపేర్లు ఉన్నాయి. ఫౌజీభాయ్, అబ్దుల్ రెమ్మాన్, ఇద్రిస్, హైదర్, లంబూ అనే పేర్లతో అతన్ని పిలుస్తుంటారు. ఇవాళ జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్రిస్‌తో పాటు జాహిద్ మన్జూర్ వాణి, మన్జూర్ అహ్మద్ కార్‌లు కూడా హతమయ్యారు.