Karnataka Schools: కర్నాటకలో ఫోన్ కాల్స్ కలకలం, పిల్లలను ఇస్లాం పాఠశాలలో చేర్పించాలంటూ, ముస్లిం విద్యార్థుల తల్లిదండ్రులకు దుబాయి నుంచి ఫోన్ కాల్స్...

ఒకదాని తరువాత మరొక వివాదం చెలరేగుతూనే ఉంది. కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లాలోని సాయి శంకర్ ఇన్స్టిట్యూట్ లో చదువుతున్న ముగ్గురు ముస్లిం విద్యార్థులు సడెన్ గా స్కూలు మానేశారు.

Hijab (Photo Credits: ANI)

కొడగు: హిజాబ్ అనంతరం కర్ణాటకలోని విద్యాసంస్థల్లో తలెత్తిన మతపరమైన వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకదాని తరువాత మరొక వివాదం చెలరేగుతూనే ఉంది. కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లాలోని సాయి శంకర్ ఇన్స్టిట్యూట్ లో చదువుతున్న ముగ్గురు ముస్లిం విద్యార్థులు సడెన్ గా స్కూలు మానేశారు. దీనికి కారణం కొన్ని రోజుల క్రిందట పాఠశాలలో ‘శౌర్య శిక్షణ వర్గం’ పేరిట బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆయుధ శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు. ఆ శిబిరంలో ఎయిర్ గన్‌లు, త్రిశూలాలు చేత పట్టుకుని బజరంగ్ దళ్ కార్యకర్తలు శిక్షణ తీసుకున్నారు. దీంతో ఆ విద్యాసంస్థల్లో చదువుతున్న ముగ్గురు ముస్లిం విద్యార్థులను, వారి తల్లిదండ్రులు వారి పిల్లలకు టీసీలు తీసుకున్నారు. అయితే కొందరు వ్యక్తులు తమకు దుబాయ్ నుంచి ఫోన్ కాల్ చేస్తున్నారని, తమ పిల్లలను మతపరమైన విద్యాసంస్థల్లో చేర్చాలని వారు సూచించినట్లు పేర్కొనడం, సంచలనంగా మారింది.

నిజానికి బజరంగ్ దళ్ శిక్షణ కార్యక్రమం సమయంలో పాఠశాలకు సెలవులు ఉన్నాయి. ఆ స్కూలు ఖాళీగా ఉన్నందునే బజరంగ్ దళ్ సభ్యులకు శిక్షణా శిబిరం నిర్వహించుకునేందుకు అనుమతి ఇఛ్చారు. ఈ శిక్షణా కార్యక్రమానికి, స్యూలు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. అయితే శిక్షణా శిబిరానికి చెందిన ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో పాఠశాలలో చదువుతున్న ముస్లిం విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాల నుండి ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ వ్యవహారంపై సాయి శంకర్ ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడు..జారు గణపతి శనివారం స్పందిస్తూ..ఆర్ఎస్ఎస్ శిక్షణ శిబిరాన్ని సాకుగా చెప్పి ముగ్గురు ముస్లిం విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలలను పాఠశాల నుంచి ఉపసంహరించుకున్నారని పేర్కొన్నారు. కొందరు ప్రైవేటు వ్యక్తులు తమ అవసరాల కోసం విద్యాసంస్థ ఆవరణను వాడుకున్నారని..ప్రస్తుతం బజరంగ్ దళ్ నిర్వహించిన శిక్షణ శిభిరం పాఠశాల కాంపౌండ్ బయట జరిగిందని..అందులో తమ పాఠశాలకు చెందిన విద్యార్థులుగాని, సిబ్బంది గానీ పాల్గొనలేదని సాయి శంకర్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యం స్పష్టం చేసింది.

మరోవైపు, ముగ్గురు ముస్లిం విద్యార్థుల తల్లిదండ్రులకు దుబాయ్ నుంచి కొందరు వ్యక్తులు ఫోన్ చేసి..తమ పిల్లలను ముస్లిం పాఠశాలలో చేర్పించాలని సూచించారని..ఆ నేపథ్యంలోనే తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడి నుంచి ఉపసంహరించుకున్నట్లు స్కూలు యాజమాన్యం తెలిపింది. “పిల్లలను ముస్లిం పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు దుబాయ్ నుండి కాల్స్ వచ్చాయని, వారికి విరాజ్‌పేట నుండి బస్సు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఆ స్కూలులో ముస్లిం ఉపాధ్యాయులు ఉన్నారు, ఇతర ముస్లిం విద్యార్థులు ఉన్నారు, కొత్తగా చేరిన మరికొందరు విద్యార్థులు కూడా ముస్లింలే ”అని జారు గణపతి పేర్కొన్నారు.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Pushpa-2 Stampede Row: సంధ్య థియేటర్‌ తొక్కిసలాట వ్యవహారంలో కీలక పరిణామం, థియేటర్‌కు షోకాజ్ నోటీసులు పంపిన సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌

Formula E Race Case: ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసు, దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని కేటీఆర్ సవాల్, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతామని ప్రకటించిన బీఆర్ఎస్