Chennai Air Show Stampede: చెన్నై ఎయిర్ షోలో విషాదం, లక్షలాది మంది తరలిరావడంతో తొక్కిసలాట, వందలాది మందికి అస్వస్థత, నలుగురుమృతి
దీంతో ఎయిర్ షోకు వచ్చిన సందర్శకులు, వీక్షకుల్లో ముగ్గురు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. ఎయిర్ షో చూడటానికి లక్షల మంది తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది.
Chennai, OCT 06: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని మెరీనా బీచ్ (Marina Beach) వద్ద ఆదివారం నిర్వహించిన ఎయిర్ షోలో (Air Show) తొక్కిసలాట (Stampede) జరిగింది. దీంతో ఎయిర్ షోకు వచ్చిన సందర్శకులు, వీక్షకుల్లో నలుగురు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. ఎయిర్ షో చూడటానికి లక్షల మంది తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఎయిర్ షో ముగిసిన తర్వాత తిరిగి వెళుతున్నప్పుడు మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసు, పౌర ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. మృతుల దేహాలను పోస్ట్ మార్టం కోసం స్థానిక ప్రభుత్వ దవాఖానకు, క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక దవాఖానలకు తరలించారు.
Here's the Video
ఎయిర్ షో చూసేందుకు లక్షాలాది మంది జనాలు తరలివచ్చారు. దీంతో మందు జాగ్రత్తలు తీసుకోవటంలో పోలీసులు వైఫల్యం చెందారు. జనం భారీగా రావటంతో పోలీసులు చేతులెత్తేశారు. తొక్కిసలాటలో వందలాది మంది ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయారు.
డీహైడ్రేషన్ కారణంగా సుమారు 265 మంది సొమ్మసిల్లి పడిపోయారు. వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సుమారు 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.