TN Shocker: ఒంటరిగా తమ్ముడి భార్య, కోరిక తీర్చాలని వెంటపడిన బావ, కాదనడంతో రెండేళ్ల కూతురితో సహా మరదలిని చంపేసిన కామాంధుడు

తన కోరిక తీర్చలేదని (When prevented from raping) తమ్ముడి భార్యను, ఆమె రెండేళ్ల కుమార్తెను కిరాతకంగా చంపేసి ఆ తర్వాత దహనం చేసి పారిపోయాడు ఓ రాక్షసుడైన అన్న. ఈ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు

Representational Image | (Photo Credits: IANS)

Chennai, April 4: తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. తన కోరిక తీర్చలేదని (When prevented from raping) తమ్ముడి భార్యను, ఆమె రెండేళ్ల కుమార్తెను కిరాతకంగా చంపేసి ఆ తర్వాత దహనం చేసి పారిపోయాడు ఓ రాక్షసుడైన అన్న. ఈ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. దిండుక్కల్‌ జిల్లా నత్తం సమీపంలోని మలయనూరు వలసు ప్రాంతానికి చెందిన నల్లపిచ్చన్‌ కుమారులు కరుప్పయ్య (30), శివకుమార్‌ (27). వీరిలో కరుప్పయ్యకు వివాహం కాలేదు.

శివకుమార్‌కు అంజలి (21)తో వివాహం జరిగింది. వీరికి మలర్‌(2) కుమార్తె ఉంది. కాగా ప్రస్తుతం అంజలి నాలుగు నెలల గర్భిణి. శనివారం శివకుమార్‌ వ్యాపారంలో భాగంగా బయట ఊరికి వెళ్లాడు. సాయంత్రం సమయంలో అదే ప్రాంతంలో ఉన్న తోటలో చిన్నారి మలర్‌వితితో కలసి అంజలి మేకలు కాస్తూ ఉంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన కరుప్పయ్య ఒంటరిగా ఉన్న అంజలిని చూసి తన కోరికను తీర్చమని ఒత్తిడి చేశాడు. దీనికి అంజలి తిరస్కరించడంతో కరుప్పయ్య కత్తితో దాడి చేశాడు.

బాలికపై 55 ఏళ్ళ వృద్ధుడి లైంగిక వేధింపులు, అతన్ని చంపి, ఆ శవాన్ని ముక్కలుగా నరికి నదిలో పారేసిన బాధితురాలి తండ్రి, మేనమామ, ఎంపీలో దారుణ ఘటన

ఈ క్రమంలో తీవ్ర గాయాలతో ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందింది. తరువాత బిడ్డ మలర్‌ విలిని కూడా అతను నరికి హత్య చేశాడు. తర్వాత ఇద్దరి మృతదేహాలకు నిప్పు (brother-in-law burnt alive his sister-in-law and nephew) పెట్టి పారిపోయాడు. దీంతో, ఆ ప్రాంతంలో పొగ రావడంతో స్థానికులు అక్కడికి వెళ్లి చూశారు. ఇద్దరి మృతదేహాలు కాలి పోతున్నట్లు గుర్తించి పోలీసులకు తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు కరుప్పయ్యను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.