New Delhi: స్నేహితురాలికి ఐఫోన్ కొనిచ్చేందుకు సొంతింటికే కన్నం వేసిన 9వ తరగతి బాలుడు, పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి...
9వ తరగతి చదువుతున్న ఆ బాలుడు తల్లి బంగారాన్ని దొంగిలించాడు. (Boy Steals Mother’s Gold To Gift iPhone To Girl ) స్వర్ణకారులకు విక్రయించిన డబ్బుతో ఐఫోన్ కొన్నాడు. తల్లి ఫిర్యాదుతో దర్యాప్తు జరిపిన పోలీసులు చివరకు నిందితుడైన ఆ బాలుడ్ని అరెస్ట్ చేశారు.
New Delhi, AUG 07: స్నేహితురాలి పుట్టిన రోజు సందర్భంగా ఐఫోన్ (I phone) గిఫ్ట్‌గా ఇచ్చేందుకు ఒక బాలుడు ఏకంగా తన ఇంటికి కన్నం వేశాడు. 9వ తరగతి చదువుతున్న ఆ బాలుడు తల్లి బంగారాన్ని దొంగిలించాడు. (Boy Steals Mother’s Gold To Gift iPhone To Girl ) స్వర్ణకారులకు విక్రయించిన డబ్బుతో ఐఫోన్ కొన్నాడు. తల్లి ఫిర్యాదుతో దర్యాప్తు జరిపిన పోలీసులు చివరకు నిందితుడైన ఆ బాలుడ్ని అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో (New Delhi) ఈ సంఘటన జరిగింది. నజాఫ్‌గఢ్ ప్రాంతంలో తల్లితో కలిసి నివసిస్తున్న బాలుడు ప్రైవేట్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. క్లాస్‌మేట్ అయిన స్నేహితురాలి పుట్టిన రోజున సప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని భావించాడు. దీని కోసం తల్లిని డబ్బు అడిగాడు. నిరాకరించిన ఆమె చదువుపై దృష్టిపెట్టాలని కొడుకును మందలించింది.
కాగా, ఆగస్ట్ 2న ఆ మహిళ ఇంట్లో చోరీ జరిగింది. ఆమెకు చెందిన రెండు బంగారు గొలుసులు, ఒక జత బంగారు చెవిపోగులు, ఒక బంగారు ఉంగరం మాయమయ్యాయి. ఆ మరునాడు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత బయట నుంచి ఎవరూ చోరీకి పాల్పడలేదని గ్రహించారు. తండ్రి మరణించడంతో తల్లితోపాటు ఉంటున్న కుమారుడిపై అనుమానం వ్యక్తం చేశారు. చోరీ తర్వాత నుంచి అతడు కనిపించడంకపోవడంతో స్కూల్‌లోని ఫ్రెండ్స్‌ను ఆరా తీశారు.
మరోవైపు ఆగస్ట్ 6న ఆ బాలుడు తన ఇంటికి వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడ మాటు వేసిన పోలీసులు ఆ బాలుడ్ని గుర్తించారు. పోలీసులను పసిగట్టి పారిపోయేందుకు ప్రయత్నించిన అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ బాలుడ్ని ప్రశ్నించగా తల్లి బంగారాన్ని తానే చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇద్దరు స్వర్ణకారులకు విక్రయించినట్లు తెలిపాడు. రూ.50,000 ఖరీదైన ఐఫోన్ కొని పుట్టిన రోజున స్నేహితురాలికి గిఫ్ట్‌గా ఇచ్చినట్లు చెప్పాడు. దీంతో కమల్ వర్మ అనే 40 ఏళ్ల స్వర్ణకారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గోల్డ్ రింగ్, బంగారం చెవిపోగులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుపై మరింతగా దర్యాప్తు చేస్తున్నారు.