IPL Auction 2025 Live

Monsoon Session Of The Parliament: నేటితో ముగియనున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు, మణిపూర్‌ అంశంపై చల్లారని విపక్షాలు, కొత్తగా తెరపైకి అధిర్ రంజన్ సస్పెన్షన్ వ్యవహారం

కాగా సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి మణిపూర్ హింసకు (Manipur) సంబంధించిన అంశం ప్రాధాన్య అంశంగా ఉంది. వాస్తవానికి సమావేశాలు ప్రారంభానికి ముందే మీడియా ముందు ఈ అంశంపై ప్రధాని మాట్లాడినప్పటికీ సభలో మాట్లాడించేందుకు విపక్షాలు పట్టు పట్టాయి.

Parliament of India (Photo Credit: ANI)

New Delhi, AUG 11: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Monsoon Session Of The Parliament) నేటితో ముగియనున్నాయి. కాగా సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి మణిపూర్ హింసకు (Manipur) సంబంధించిన అంశం ప్రాధాన్య అంశంగా ఉంది. వాస్తవానికి సమావేశాలు ప్రారంభానికి ముందే మీడియా ముందు ఈ అంశంపై ప్రధాని మాట్లాడినప్పటికీ సభలో మాట్లాడించేందుకు విపక్షాలు పట్టు పట్టాయి. ఒకరంగా చెప్పాలంటే.. ఈ సమావేశాలు మొత్తంగా మణిపూర్ (Manipur) అంశం చుట్టూనే తిరిగాయి. దీన్ని ఆధారం చేసుకుని ప్రభుత్వంపై అవిశ్వాసం కూడా పెట్టాయి. కానీ గురువారం జరిగిన ఓటింగులో అది వీగిపోయింది. ఈ అంశం చివరి రోజైన నేడు కూడా హాట్ హాట్ గానే ఉండనుంది. అయితే దీనికి తోడు అధీర్ రంజన్ (Adhir ranjan) సస్పెన్షన్‌ కూడా ప్రస్తావనకు రానుంది. ఈ రెండు అంశాలపైనే విపక్షాలు సభలో అలజడి రేపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సభా కార్యక్రమాలను అడ్డుకున్నందుకు గాను కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరిపై గురువారం సస్పెన్షన్ వేటు పడింది.

No Confidence Motion Defeated: మూజువాణీ ఓటింగ్‌‌తో లోక్‌సభలో వీగిపోయిన అవిశ్వాస తీర్మానం, అవిశ్వాసంపై సభలో మాట్లాడిన ప్రధాని మోదీ 

కాగా, అవిశ్వాస తీర్మానంపై ప్రధాని స్పందిస్తూ, కాంగ్రెస్‌తో (Congress) సహా మొత్తం ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. యూపీఏ హయాంలో జరిగిన స్కామ్‌లను ఏకరువు పెడుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు. నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు కాంగ్రెస్ పాలిత ప్రధానులను ప్రస్తావించారు. ఇక అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కంటే ముందే విపక్షాలు లోక్ సభ నుంచి వాకౌట్ చేశాయి. అనంతరం ఓటింగ్ నిర్వహించగా మూజువాణి ఓటుతో తీర్మానం విఫలమైంది.



సంబంధిత వార్తలు

AP CM Chandrababu: గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి..జీవోలను రహస్యంగా ఉంచారని సీఎం చంద్రబాబు మండిపాటు, అధికారాన్ని దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కామెంట్

Constitution Day of India: 75వ రాజ్యాంగ దినోత్సవం, ప్రాథమిక హక్కులు- భారత పౌరులకు అందించిన గొప్ప వరం, ప్రజాస్వామ్యానికి మూలస్తంభంలా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ

Rains in AP: బంగాళాఖాతంలో వాయుగుండం.. నేటి నుంచి ఏపీలో భారీ వర్షాలు.. ఈ నెల 29 వరకు వానలే వానలు.. దక్షిణ కోస్తాలో ఈదురుగాలులు

Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ఉభయసభలు వాయిదా, మణిపూర్ హింస, అదానీ గ్రూప్‌పై లంచం ఆరోపణలపై చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్