OTP Messages May Get Delayed: డిసెంబర్ 1 నుండి ఓటీపీ మెస్సేజ్‌లు ఆలస్యం, ట్రాయ్ కొత్త నిబంధనలు..ఎందుకో తెలుసా?

ఓటీపీ..ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగిన దగ్గరి నుండి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. బ్యాంకు,ఫుడ్,డెలివరీ ఏదైనా ఓటీపీలు తప్పనిసరి. చివరి కొరియర్ సర్వీసులు కూడా ఓటీపీ ద్వారానే జరుగుతున్నాయి. అయితే ఇది కస్టమర్ల భద్రతకు ఉపయోగపడుతున్న కొన్ని సందర్భాల్లో దుర్వినియోగం కూడా అవుతోంది. ఫలితంగా ఎంతో మంది డబ్బులు పొగొట్టుకున్న సందర్భాలున్నాయి.

TRAI New rules may cause delays in OTP from December 1(X)

Hyd, Nov 27:  ఓటీపీ..ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగిన దగ్గరి నుండి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. బ్యాంకు,ఫుడ్,డెలివరీ ఏదైనా ఓటీపీలు తప్పనిసరి. చివరి కొరియర్ సర్వీసులు కూడా ఓటీపీ ద్వారానే జరుగుతున్నాయి. అయితే ఇది కస్టమర్ల భద్రతకు ఉపయోగపడుతున్న కొన్ని సందర్భాల్లో దుర్వినియోగం కూడా అవుతోంది. ఫలితంగా ఎంతో మంది డబ్బులు పొగొట్టుకున్న సందర్భాలున్నాయి.

ఈ నేపథ్యంలో టెలికాం రెగ్యులెటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1 నుండి నకిలీ కాల్‌లు, సందేశాలను అరికట్టేందుకు కొత్త నిబంధనలు తీసుకురానుంది. దీని ఫలితంగా ఇకపై ఓటీపీ మెస్సేజ్‌లు కాస్త ఆలస్యంగా రానున్నాయి.

ఈ నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత అవాంఛిత కాల్‌ల సమస్య తొలగిపోనుంది.  దీంతో పాటు నకిలీ సందేశాలు, కాల్‌లను ఫిల్టర్ చేయడంలో, బ్యాంకింగ్ సందేశాలు, ఓటీపీలను పొందడంలో ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఒక వేళ ఓటీపీలు ఆగిపోతే మీరు ఎలాంటి లావాదేవీలు చేయలేరు. అలాగే ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డర్‌ చేసిన తర్వాత డెలివరీ సమయంలో మీ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్‌ చేస్తేనే మీకు డెలివరీ బాయ్‌ మీ ప్రొడక్ట్‌ను అందజేస్తారు. దీంతో ఓటీపీలు రాకుండా ఆలస్యమైనా ఆన్‌లైన్‌ డెలివరీని తీసుకోలేరు.

ట్రాయ్ నిబంధనలకు లోబడని SMS లేదా Android యాప్ APK ఫైల్‌లను బ్లాక్ చేయాలని TRAI నిర్ణయించింది. ఈ లింక్ లేదా మెసేజ్‌పై క్లిక్ చేయడం ద్వారా, హ్యాకర్లు మొబైల్ నుండి మొత్తం సమాచారాన్ని, డబ్బును లాక్కుంటారు. ఇలాంటి మోసాలు జరగకుండా ట్రాయ్ కఠిన చర్యలు తీసుకుంది. అయితే ఓటీపీ ప్రాతిపదికన పనిచేసే యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లు, వారి పేరు నమోదు చేయకపోతే, వారు పంపిన సందేశం లేదా OTP కస్టమర్ ఫోన్‌కు చేరదు. బ్యాంకులు, పేమెంట్ ఆపరేటర్ల నుండి Zomato, Uber వంటి యాప్‌ల వరకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ఇన్ క‌మ్ ట్యాక్స్ రిట‌ర్న్స్ ఫైల్ చేస్తున్నారా? ఈ త‌ప్పు చేశారంటే రూ. 10 ల‌క్ష‌లు ఫైన్ 

URLలు, OTT లింక్‌లు, APKలు (Android అప్లికేషన్ ప్యాకేజీలు) లేదా కాల్ బ్యాక్ నంబర్‌లను కలిగి ఉన్న సందేశాలను బ్లాక్ చేయాలని ట్రాయ్‌ టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు తమ సందేశాలు, ఓటీపీ టెంప్లేట్‌లు, కంటెంట్‌ని జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా వంటి టెలికాం ఆపరేటర్‌లతో నవంబర్ 31 లోపు నమోదు చేసుకోవాలి. టెలికాం కంపెనీలతో పాటు ఫుడ్ డెలివరీ సంస్థలు ట్రాయ్ నిబంధనలకు ఒకే చెప్పకపోతే ఓటీపీలు నిలిచిపోయే పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా డిసెంబర్ 1 నుండి వినియోగదారులు ఓటీపీ మెస్సేజ్ పొందడంలో ఆలస్యం తప్పదు. ఇదంతా వినియోగదారుల భద్రత కోసమేనని ట్రాయ్ స్పష్టం చేసింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement