'Adivasis were never Hindus': గిరిజనులు ఎప్పటికీ హిందువులు కాలేరు, వారంతా స్వదేశీ ప్రజలు, హార్వర్డ్ విశ్వవిద్యాలయ వార్షికోత్సవంలో సంచలన వ్యాఖ్యలు చేసిన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గిరిజన ప్రజలు హిందూ మతాన్ని పాటించరని, వారు ఎప్పుడూ హిందువులు కాలేరని (tribals were never Hindus and they will never be) సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఆదివాసీలు (గిరిజనులు) ఎప్పుడూ హిందువులు కాదని, వారు ఎప్పటికీ ఉండరు" అని ఆయన (Jharkhand CM Hemant Soren) అన్నారు

Jharkhand Mukti Morcha (JMM) president Hemant Soren. | Image Courtesy: PTI

Ranchi,Feb 22: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గిరిజన ప్రజలు హిందూ మతాన్ని పాటించరని, వారు ఎప్పుడూ హిందువులు కాలేరని (tribals were never Hindus and they will never be) సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఆదివాసీలు (గిరిజనులు) ఎప్పుడూ హిందువులు కాదని, వారు ఎప్పటికీ ఉండరు" అని ఆయన (Jharkhand CM Hemant Soren) అన్నారు.

గిరిజనులు ప్రకృతిని ఆరాధిస్తారని, అందుకే వారిని "స్వదేశీ ప్రజలు" అని పిలుస్తారు అని జార్ఖండ్ సిఎం జార్ఖండ్ ముక్తి మోర్చా చీఫ్ సోరెన్ అన్నారు.శనివారం రాత్రి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన 18 వ వార్షిక భారత సదస్సులో (Hemant Soren at Harvard conference) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపన్యాసం ఇచ్చిన తరువాత అడిగిన ప్రశ్నకు సమాధానంగా సోరెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

జార్ఖండ్‌ రాష్ట్రంలో 32 గిరిజన సంఘాలు ఉన్నప్పటికీ, ‘మా భాష, సంస్కృతిని’.. ప్రోత్సహించలేకపోయామని సోరెన్ అన్నారు. తదుపరి జనాభా గణనలో ఆదివాసీల కోసం ప్రత్యేక కాలం చేర్చాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు, తద్వారా ఆదివాసీలు తమ సంప్రదాయంతో పాటు సంస్కృతిని కొనసాగించడానికి తమను తాము ఆదివాసీలుగా జాబితాలో చేరవచ్చు అని ఆయన పేర్కొన్నారు.

పుదుచ్చేరిలో కుప్పకూలిన కాంగ్రెస్ ప్రభుత్వం, బల పరీక్షను నిరూపించుకోవడంలో విఫలమైన నారాయణస్వామి సర్కార్, సీఎం రాజీనామా, తదుపరి ముఖ్యమంత్రిపై పెరుగుతున్న ఉత్కంఠ

‘ఆదివాసీలు ఎప్పుడూ హిందువులు కాదు (Adivasis were never Hindus), వారు ఎప్పటికీ హిందువులుగా ఉండరు, ఆదివాసీలు ఎక్కడికి వెళ్తారు. జనాభా లెక్కల్లో హిందూ, సిక్కు, జైన, ముస్లిం, క్రిస్టియన్ అని పేర్కొన్నట్లుగానే ఆదివాసీలకు కూడా కాలమ్‌ ఉండాలి’ అని ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ తెలిపారు. రాజ్యాంగంలో భద్రతలు ఉన్నప్పటికీ, ఆదివాసీలకు తగినంత ప్రోత్సాహం లభించడం లేదని సీఎం తెలిపారు. యుగాలుగా ఆదివాసీలు కిందకు నెట్టివేయబడ్డారని, ఈరోజు కూడా అదే మనస్తత్వంతో ఉన్నారని చెప్పారు.

2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో సుమారు 3.24 కోట్ల మంది గిరిజన ప్రజలు ఉన్నారు. జార్ఖండ్‌లోని జనాభాలో 26 శాతం మంది గిరిజనులు ఉన్నారు. రాజ్యాంగంలో భద్రతలు ఉన్నప్పటికీ ఆదివాసీలె వెనక్కి నెట్టివేయబడ్డారని, వారిని అత్యంత తక్కువ కులంగా చూస్తారని, ఇది ఆందోళన కలిగించే విషయం అని జార్ఖండ్ సీఎం అన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Special Package For Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు గుడ్‌న్యూస్‌, ఏకంగా రూ. 11,500 కోట్ల స్పెషల్ ప్యాకేజీ ఇచ్చేందుకు కసరత్తు, కేంద్ర కేబినెట్‌ భేటీలో చర్చ

CM Revanth Reddy: ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపేందుకు తెలంగాణ నుండి మద్దతిస్తాం...మరో రెండు హామీలను ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌తోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని వెల్లడి

Ruckus at Mohan Babu University: వీడియోలు ఇవిగో, ఓరేయ్ ఎలుగుబంటి ఎవడ్రా నువ్వు అంటూ మంచు మనోజ్ ఫైర్, ఎట్టకేలకు తాత, నాయనమ్మ సమాధుల వద్దకు వెళ్లి నివాళులర్పించిన మనోజ్ దంపతులు

Chandrababu on Telangana: వీడియో ఇదిగో, నా విజన్ వల్లే తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది, సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Share Now