Uttar Pradesh Shocker: కబాబ్ టేస్టీగా లేదని గన్‌తో కాల్పులు, వంటమాస్టర్‌ను హత్యచేసిన దుండగులు, యూపీలో ఘాతుకం
చిన్న చిన్న విషయాలకే చంపేస్తున్నారు. అర్థం లేని ఆవేశంలో, పట్టరాని కోపంలో ప్రాణాలు తీసేస్తున్నారు. సాటి మనిషిని మనిషే పొట్టన పెట్టుకుంటున్నాడు. తాజాగా జరిగిన ఓ ఘటన అందరినీ షాక్ కి గురి చేసింది. కబాబ్ రుచిగా లేదని ఇద్దరు వ్యక్తులు రెచ్చిపోయారు. మరో మనిషిని గన్ తో కాల్చి చంపేశారు.
Lucknow, May 05: మనిషి ప్రాణానికి విలువే లేకుండా పోయింది. చిన్న చిన్న విషయాలకే చంపేస్తున్నారు. అర్థం లేని ఆవేశంలో, పట్టరాని కోపంలో ప్రాణాలు తీసేస్తున్నారు. సాటి మనిషిని మనిషే పొట్టన పెట్టుకుంటున్నాడు. తాజాగా జరిగిన ఓ ఘటన అందరినీ షాక్ కి గురి చేసింది. కబాబ్ రుచిగా లేదని ఇద్దరు వ్యక్తులు రెచ్చిపోయారు. మరో మనిషిని గన్ తో కాల్చి చంపేశారు. కబార్ రుచిగా లేదని ఇద్దరు వ్యక్తులు ఓ వంట మనిషిని కాల్చి చంపిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని బరేలీ పట్టణంలో జరిగింది. పట్టణంలోని ప్రేమ్ నగర్ లోని కబాబ్ దుకాణానికి ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చారు. కబాబ్ ఆర్డర్ ఇచ్చారు. దాన్ని తిన్నారు. కబాబ్ తిన్న తర్వాత రుచిగా లేదని (Kebab Not Tasty) షాపు ఓనర్ తో గొడవ పెట్టుకున్నారు. ఆ తర్వాత బిల్లు కట్టకుండా అలాగే తమ కారు దగ్గరికి వెళ్తున్నారు. ఇంతలో షాపు యజమాని తన వంటి మనిషిని వారి దగ్గరికి పంపించాడు. అప్పటికే తీవ్రమైన కోపంలో ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు వంటమనిషి డబ్బుల కోసం తమ దగ్గరికి రావడంతో విచక్షణ కోల్పోయారు. ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి.. ఆవేశంలో ఊగిపోతూ తన దగ్గరున్న తుపాకీతో వంటమనిషిని (Cook Master) కాల్చి చంపాడు. వంటి మనిషి స్పాట్ లోనే చనిపోయాడు. మృతుడిని కబాబ్ మాస్టర్ గా గుర్తించారు.
ఆ తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు తమ కారులో అక్కడి నుంచి పారిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. హోటల్ లో పని చేసే సిబ్బంది తమ ఫోన్లలో ఆ ఇద్దరు వ్యక్తులను, వారి కారు ఫొటోలు తీశారు. వాటి ఆధారంగా పోలీసులు కారుని, హంతకులను గుర్తించారు. కారు ఉత్తరాఖండ్ లోని కాశీపూర్ లో ఉన్నట్లు ట్రేస్ చేశారు. హంతకులను మయాంక్ రస్తోగి, తజీమ్ శంషీగా గుర్తించారు.
హత్య తర్వాతి రోజున నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా హంతకులను పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. హత్య, ఆయుధాల చట్టం కింద ఆ ఇద్దరిపై కేసు నమోదు చేసి జైలుకి పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మయాంక్ రస్తోగీ ఓ వ్యాపారవేత్త కొడుకు. అతడు తన తండ్రికి చెందిన లైసెన్స్డ్ రివాల్వర్ తో వంటమనిషిని హత్య చేశాడు.