Union Budget 2021 Key Points: దేశవ్యాప్తంగా డిజిటల్ పద్ధతిలో జనాభా లెక్కింపు, 75 ఏళ్లు పైబడిన వారికి ఐటీ రిటన్స్ దాఖలు నుంచి మినహాయింపు, ఒకే దేశం... ఒకే రేషన్ కార్డు దేశ వ్యాప్తంగా అమలు, బడ్జెట్ 2021 కీ పాయింట్స్ ఇవే
వయో వృద్థులకు ఐటీ రిటన్స్ దాఖలు చేయడం నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించారు. పెన్షన్, పన్ను ఆదాయాలు మాత్రమే కలిగిన 75 సంవత్సరాలకు పైబడిన వృద్ధులకు ఐటీ రిటన్స్ దాఖలు ( income-tax returns) చేయడం నుంచి ఈ మినహాయింపు వర్తిస్తుంది.
New Delhi, Feb 1: ఆదాయ వనరుగా పెన్షన్ మాత్రమే ఉన్న సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో (Union Budget 2021) ఊరట కల్పించింది. వయో వృద్థులకు ఐటీ రిటన్స్ దాఖలు చేయడం నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించారు. పెన్షన్, పన్ను ఆదాయాలు మాత్రమే కలిగిన 75 సంవత్సరాలకు పైబడిన వృద్ధులకు ఐటీ రిటన్స్ దాఖలు ( income-tax returns) చేయడం నుంచి ఈ మినహాయింపు వర్తిస్తుంది.
ఇక చిన్న మొత్తాల్లో పన్ను చెల్లింపుదారులకు వివాద పరిష్కార కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అందుబాటు ధరల్లో గృహనిర్మాణానికి పన్ను విరామాన్ని ప్రకటించారు. పన్ను రిటర్నులను తిరిగి తెరవడానికి కాలక్రమం ఆరు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాలకు తగ్గించబడింది. ఎన్నారైలు భారత్‌లో ఉండేందుకు 182 రోజుల నుంచి 120 రోజులకు కుదింపు చేశారు. ఎన్‌ఐఆర్‌లకు డబుల్ టాక్సేషన్‌నుంచి ఊరట కల్పించింది. అన్ని రంగాల్లోనూ కార్మికులకు కనీస వేతనాలు వర్తింపు కల్పించింది.
కరోనా కారణంగా ద్రవ్య లోటు భారీగా పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్య లోటు లక్ష్యం జీడీపీలో 3.5 శాతం కాగా.. అది కాస్తా 9.5 శాతానికి పెరిగినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ఈ ద్రవ్య లోటు 2021-22 ఆర్థిక సంవత్సరానికి 6.8 శాతంగా అంచనా వేశారు.
దేశవ్యాప్తంగా జనాభా లెక్కింపు చేపట్టనున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయితే తొలిసారి డిజిటల్ పద్ధతిలో జనాభా గణన ఉంటుందని మంత్రి తెలిపారు. డిజిటల్ జనాభా లెక్కింపు ప్రక్రియ కోసం సుమారు 3700 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. సముద్రాల అధ్యయనం కోసం డీప్ ఓషియన్ మిషన్‌ను స్టార్ట్ చేయనున్నామన్నారు. 4 వేల కోట్లతో సముద్రాల సర్వే చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ కింద ఎస్సీ విద్యార్థులకు 35 వేల కోట్లు కేటాయించారు. 2025-26 సంవత్సరం వరకు ఈ స్కాలర్‌షిప్‌లు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. మరో 100 సైనిక్ స్కూళ్లను దేశవ్యాప్తంగా స్టార్ట్ చేయనున్నారు.
ఒకే దేశం... ఒకే రేషన్ కార్డు విధానాన్ని దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ అమలు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వలస కార్మికులకు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు వేర్వేరు చోట్ల ఉన్నా... వాటా ప్రకారం రేషన్ తీసుకోవచ్చని నిర్మలా పేర్కొన్నారు. ఈ పథకంతో ముఖ్యంగా వలస కార్మికులు లాభపడతారని పేర్కొన్నారు. మరోవైపు తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుడి ఉందని స్పష్టం చేశారు. కనీస మద్దతు ధర ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుందని నిర్మలా పేర్కొన్నారు.
బడ్జెట్ కీ పాయింట్స్
డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ. 1.75 లక్షల కోట్లు
2022లో ద్రవ్య లోటు అంచనా - జీడీపీలో 6.8 శాతం
2022లో స్థూల మార్కెట్ రుణాల లక్ష్యం రూ. 12 లక్షల కోట్లు
ఆర్ అండ్ డీలో ఇన్నోవేషన్‌కు ప్రోత్సాహం
నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ
15 వేల పాఠశాలలు శక్తివంతం
కొండ ప్రాంతాలలో ఏకలవ్య స్కూల్స్ కోసం రూ. 38 కోట్లు, రూ. 40 కోట్లు కేటాయింపు
ఎన్‌జీఓలతో భాగస్వామ్యం ద్వారా 100 సైనిక్ స్కూల్స్ ఏర్పాటు
లెహ్, లడఖ్‌లో యూనివర్సిటీ ఏర్పాటు
ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పెట్టుబడుల ఉపసంహరణఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్ పెట్టుబడులలో ఉపసంహరణకు గ్రీన్ సిగ్నల్
ఐడీబీఐ, భారత్ ఎర్త్ మూవర్స్ పెట్టుబడులలో ఉపసంహరణకు గ్రీన్ సిగ్నల్
ఈ ఏడాదిలోనే ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూ : దీని కోసం చట్టసవరణ
2021-22లో పవన్ హన్స్, ఎయిరిండియా ప్రైవేటీకరణ
మౌలిక రంగానికి భారీగా నిధులు
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.40వేల కోట్లు
తయారీ రంగ అభివృద్ధికి ప్రత్యేకమైన ఆర్థిక సంస్థ ఏర్పాటు
విద్యుత్ రంగానికి రూ.3.05 లక్షల కోట్లు
పీపీపీ పద్ధతి ద్వారా 7 కొత్త ప్రాజెక్ట్‌ల అభివృద్ధికి రూ.2,200 కోట్లు
ఉజ్వల స్కీమ్ కింద మరో 9 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు
జమ్మూకశ్మీర్‌లో గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటు
కొత్తగా మరో 100 జిల్లాల్లో గ్యాస్ పంపిణీని పటిష్టం చేస్తాం
సొలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి రూ.వెయ్యి కోట్లు
బ్యాంక్ ఖాతాదారులకు ఇన్సూరెన్స్ రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంపు
రైతుల కోసం బడ్జెట్లో ఏం పెట్టారు
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
రైతుల ఉత్పత్తుల్లో భారీగా పెరుగుదల ఉంది
వసాయ సంస్కరణలకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది
వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయింపు
2021-22లో ఆహార ఉత్పత్తుల సేకరణ
కనీస మద్దతు ధరకు రూ.లక్షా 72వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా
2020-21లో రైతులకు రూ.75వేల కోట్లు కేటాయించాం
తద్వారా 1.5 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు
రైతు రుణాల లక్ష్యం రూ.16.5 లక్షల కోట్లు
2022లో అగ్రి క్రెడిట్ లక్ష్యం రూ. 16.5 లక్షల కోట్లు
5 మేజర్ ఫిషింగ్ హబ్స్ ఏర్పాటు