Union Budget 2022-23 Highlights: తెలుగు రాష్ట్రాలకు శుభవార్త, త్వరలో కృష్ణ గోదావరి, కృష్ణ పెన్నా, పెన్నా-కావేరి నదుల అనుసంధానం, భారత్‌లో సొంత డిజిటల్ కరెన్సీ, నిర్మల బడ్జెట్ 2022 ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవే..
నాలుగోసారి పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2022 ను (Union Budget 2022-23 Highlights) ప్రవేశపెట్టారు. కరోనా సమయంలో మరో బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు ప్రసంగం మొదలుపెట్టారు. ఈ ఏడాది వృద్ధి రేటు 9.2 శాతం దాటుతుందని అంచనా. వృద్ధి రేటులో ముందున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు
Union Budget 2022-23 Highlights: నాలుగోసారి పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2022 ను (Union Budget 2022-23 Highlights) ప్రవేశపెట్టారు. కరోనా సమయంలో మరో బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు ప్రసంగం మొదలుపెట్టారు. ఈ ఏడాది వృద్ధి రేటు 9.2 శాతం దాటుతుందని అంచనా. వృద్ధి రేటులో ముందున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. వ్యాక్సినేషన్ క్యాంపెయిన్‌జోరుగా సాగుతోంది. కొవిడ్ కట్టడిలో వ్యాక్సినేషన్ కీలకంగా వ్యవహరించిందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) డిజిటల్ రుపీని జారీ చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Nirmala Sitharaman) మంగళవారం బడ్జెట్ ప్రసంగంలో భాగంగా చెప్పారు. 2022-23లో భారత దేశానికి సొంత డిజిటల్ కరెన్సీ వస్తుందన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా డిజిటల్ రుపీని జారీ చేయబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రాలకు రూ.1 లక్ష కోట్ల మేరకు వడ్డీ లేని రుణాలను ఇస్తామన్నారు. డిజిటైజేషన్, అర్బన్ ప్లానింగ్ చేసే రాష్ట్రాలకు ఈ రుణాలను ఇస్తామన్నారు.
దేశంలో 60 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ తదుపరి లక్ష్యం అని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.కేంద్ర బడ్జెట్ 2022ను సమర్పిస్తూ నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రసంగించారు.‘‘పిఎం గతి శక్తి ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకువెళుతుంది, యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయి’’ అని ఆమె అన్నారు.దేశంలో యువత, మహిళలు, పేదలకు సాధికారత కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆమె అన్నారు.ఆత్మనిర్భర్ భారత్‌ను సాధించడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌కు అద్భుతమైన స్పందన లభించిందని, దీని వల్ల వచ్చే ఐదేళ్లలో 60 లక్షల కొత్త ఉద్యోగాలు, 30 లక్షల కోట్ల రూపాయల అదనపు ఉత్పత్తిని సృష్టించే అవకాశం ఉందని నిర్మలాసీతారామన్ చెప్పారు.
ఈసారి కెమికల్-ఫ్రీ నేచురల్ వ్యవసాయానికి(సేంద్రియ వ్యవసాయం) తగిన ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. హానికరమైన రసాయనాలు ఉపయోగించకుండా పూర్తిగా సేంద్రియ పద్దతిలో వ్యవసాయం ప్రస్తుత కరోనా సమయంలో చాలా ముఖ్యం అని మంత్రి తెలిపారు. అందుకే ఆ దిశగా కెమికల్-ఫ్రీ నేచురల్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. మొదటి దశలో గంగానది పరివాహక ప్రాంతాల్లోని 5 కిలోమీటర్లలోపు ఉన్న వ్యవసాయ భూముల రైతులతో పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపడతామన్నారు. అలాగే రాష్ట్రాలు కూడా ఈ విధాన్ని ఊతమిచ్చేలా వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో సిలబస్‌లో మార్పు చేసి సేంద్రియ వ్యవసాయానికి మద్దతుగా పాఠ్యాంశాలు తీసుకురావాలని కోరారు.
ఆర్గానికి ఫార్మింగ్, మోడ్రన్-డే అగ్రికల్చర్‌లకు ప్రోత్సహకాలను తగ్గించాలని తెలిపారు. అప్పుడే సేంద్రియ వ్యవసాయం ఆచరణలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత కరోనా సమయంలో ఆరోగ్యానికి రసాయనాలు వాడి పండిస్తున్న ఆహార పదార్థాలు ఎంతమాత్రం మంచివి కావని మంత్రి అభిప్రాయపడ్డారు. కనుక కెమికల్-ఫ్రీ నేచురల్ వ్యవసాయం ఈ సమయంలో చాలా అవసరం అన్నారు. ఇక సేంద్రియ వ్యవసాయం అనేది ప్రకృతి సిద్దమైన పర్యావరణ అనుకూలమైన జీవాధారిత వ్యవసాయం. ముఖ్యంగా ప్రాంతీయంగా లభించే వనరులతో వ్యవసాయం చేయుటకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు హానికర రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్నివిస్మరిస్తూ పూర్తిగా ప్రకృతికి అనుగుణంగా వ్యవసాయం చేయడానికి అవకాశం కల్పిస్తుంది.
5G స్పెక్ట్రమ్‌కు ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాలు ఇస్తామని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం లోక్‌సభకు చెప్పారు. 5G స్పెక్ట్రమ్ వేలం ఈ ఏడాది ప్రారంభమవుతుందన్నారు. 2025నాటికి దేశంలోని అన్ని గ్రామాకూ ఆప్టికల్ ఫైబర్ విస్తరిస్తుందన్నారు. రక్షణ రంగానికి అవసరమైనవాటిలో 68 శాతం వరకు దేశీయ మార్కెట్ల నుంచే సేకరిస్తామని చెప్పారు. ఎండ్-టు-ఎండ్ ఈ-బిల్ ద్వారా పారదర్శకతను తీసుకొస్తామని చెప్పారు. తదుపరి తరం సాంకేతిక పరిజ్ఞానంపై బడ్జెట్‌లో దృష్టిసారించినట్లు తెలిపారు. 2030నాటికి 280 గిగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సోలార్ ఎనర్జీలో హై ఎఫిషియెన్సీ మాడ్యూల్స్‌కు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ రూ.19,500 కోట్లు అందజేయనున్నట్లు ప్రకటించారు.
దేశవ్యాప్తంగా నూటికి నూరు శాతం తపాలా కార్యాలయాలు కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌లోకి వస్తాయని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం లోక్‌సభకు తెలిపారు. తపాలా కార్యాలయాలు ఆర్థిక సమ్మిళితత్వంలో భాగస్వాములవుతాయన్నారు. విశ్వాస ఆధారిత పరిపాలన కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు అన్ని సేవలు ఒకే చోట లభించే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ-పాస్‌పోర్టుల జారీ 2022లో ప్రారంభమవుతుందన్నారు. దీంతో ప్రయాణాలు సులభతరం అవుతాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0 ప్రారంభమవుతుందన్నారు.
టైర్ 2, టైర్ 3 నగరాలకు మరిన్ని నిధులను కేటాయించి, అభివృద్ధి చేస్తామన్నారు. హై లెవెల్ అర్బన్ ప్లానింగ్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభిస్తామని చెప్పారు. 2047 నాటికి దేశంలో సగం జనాభా నగరాల్లోనే ఉంటుందని, నగరాల అభివృద్ధికి పెద్ద పీట వేస్తామని చెప్పారు. ఈ-వెహికిల్స్ కోసం బ్యాటరీ స్వాపింగ్ పాలసీని ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాల మౌలిక సదుపాయాలను ఆధునికీకరిస్తామని తెలిపారు. ప్రజా రవాణా పర్యావరణ హితంగా మారడానికి ఈ చర్యలు దోహదపడతాయని విశ్లేషకులు చెప్తున్నారు.
రైతుల కోసం పలు పథకాలకు నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.2023వ సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా మంత్రి ప్రకటించారు. భారతదేశంలోని రైతులకు రసాయన రహిత సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. పంట అంచనా, భూ రికార్డుల డిజిటలైజేషన్, క్రిమిసంహారక మందుల పిచికారీ కోసం కిసాన్ డ్రోన్‌లను వినియోగిస్తామని మంత్రి పేర్కొన్నారు.. 2.37 లక్షల కోట్ల రూపాయలను ఎంఎస్‌పిని నేరుగా రైతులకు చెల్లిస్తామని సీతారామన్ చెప్పారు.
బడ్జెట్ వేళ విమానయాన రంగానికి భారీ షాక్, ఏవియేషన్ ఫ్యూయల్ ధర 8.5 శాతం పెంచుతూ నిర్ణయం
రానున్న మూడేళ్ళలో 100 కార్గో టెర్మినల్స్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఆతిథ్య రంగం పునరుజ్జీవం కోసం కృషి చేస్తామన్నారు. ఎంఎస్ఎంఈ రంగంలో అదనంగా రూ.2 లక్షల కోట్ల క్రెడిట్ సదుపాయం కల్పిస్తామన్నారు. స్టార్టప్ కంపెనీలను ‘డ్రోన్ శక్తి’ ద్వారా ప్రోత్సహిస్తామని తెలిపారు. డ్రోన్ టెక్నాలజీకి ఈ బడ్జెట్‌లో గట్టి ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యా రంగానికి ప్రోత్సాహంలో భాగంగా 200 టీవీ చానళ్ళకు ఈ-విద్యను విస్తరిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలకు ఈ-కంటెంట్ డెలివరీని ప్రోత్సహిస్తామన్నారు. విద్యార్థుల కోసం డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్, నేషనల్ టెలీ హెల్త్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తామన్నారు. మెరుగైన మౌలిక సదుపాయాలతో నూతన తరం అంగన్వాడీల ఏర్పాటు చేస్తామని, 2 లక్షల అంగన్వాడీలను అప్‌గ్రేడ్ చేస్తామని చెప్పారు. 2023 నాటికి పీఎం ఆవాస్ యోజన క్రింద బలహీన వర్గాలకు చెందిన 80 లక్షల మందికి గృహాలను నిర్మిస్తామని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల కోసం కొత్తగా పీఎం గతిశక్తి పథకం క్రింద ఓ పథకాన్ని ప్రకటించారు.
ప్రధాన మంత్రి గతి శక్తి మిషన్, సమ్మిళిత అభివృద్ధి, ఉత్పాదకత పెంపు, ఆర్థిక పెట్టుబడులు- ఈ నాలుగు అంశాలపై ఈ బడ్జెట్ ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్‌సభలో చెప్పినపుడు బీజేపీ సభ్యులు బల్లలు చరుస్తూ తమ హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. 25,000 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారుల విస్తరణను లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించగానే సభ్యులు చప్పట్లు చరిచారు. కొత్తగా 400 వందే భారత్ రైళ్ళను ప్రారంభిస్తామని మంత్రి చెప్పినపుడు కూడా సభ్యులు బల్లలు చరిచారు.
మరికొన్ని బడ్జెట్ ముఖ్యాంశాలు .
ఆత్మనిర్భర్ స్ఫూర్తితో ముందుకు సాగనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. వంట నూనె దేశీయంగా తయారీపై దృష్టి. వెయ్యి లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరిస్తామన్నారు. పీఎం ఆవాస్ యోజన కింద 18 లక్షల ఇళ్లు. 48 వేల కోట్లు కేటాయింపు. 75 జిల్లాలో 75 డిజిటల్ బ్యాంకింగ్ కేంద్రాలు. తృణ ధాన్యాల సంవత్సరంగా 2023గా పేర్కొన్నారు. యాప్‌లో ప్రజలకు అందుబాటులో బడ్జెట్. వచ్చే ఐదేళ్లలో మేకిన్ ఇండియాలో భాగంగా 60 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రణాళికగా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి ప్రకటించారు. ఇంటి ఇంటికి మంచి నీటి కోసం 60 వేల కోట్ల కేటాయింపు చేశారు.
వ్యవసాయ రంగానికి ఆధునిక టెక్నాలజీని ఉపయోగం, భూ రికార్డులను డిజిటలైజేషన్. డ్రోన్‌లతో పంట పొలాల పరిరక్షణ. సేంద్రీయ వ్యవసాయానికి ప్రత్యేక రాయితీల ప్రకటన. పీఎం ఈ విద్య కోసం 200 ఛానెల్స్. ప్రాంతీయ భాషల్లో విద్యాబోధన.. 1.12 తరగతులకు వర్తింపు. ఆతిథ్య రంగానికి రూ. 5 లక్షల కోట్ల కేటాయింపులు. మైక్రో, చిన్నతరహా కంపెనీలకు 2 లక్షల కోట్ల కేటాయింపులు. ఎంఎస్ ప్రత్యేకంగా డిజిటల్ యూనివర్సిటీ. స్టార్టప్‌లకు 2 లక్షల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో 4 మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్‌లు. అంగన్‌వాడీ 2.0 కింద 2 లక్షల అంగన్‌వాడీ కేంద్రాల ఆధునీకరణ.
తెలుగు స్టేట్స్‌లో నదుల అనుసంధానంపై ప్రణాళిక. త్వరలో కృష్ణ గోదావరి, కృష్ణ పెన్నా నదుల అనుసంధానం. పెన్నా-కావేరి నదుల అనుసంధానానికి ప్లాన్. గంగా నదీ తీరంలో 5 కిలోమీటర్ల మేర సేంద్రీయ సాగు. అన్ని పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి. ఇకపై చిప్ ఆధారిత పాస్ పోర్టులు. డిజిటల్ పేమెంట్, నెట్‌బ్యాంకింగ్ సేవలకు ప్రోత్సాహకాలు. గతిశక్తి కార్గొ టెర్మినళ్ల నిర్మాణం. కొత్త రహదారుల నిర్మాణం. పేద, మధ్య తరగతి సాధికారికత కోసం ప్రభుత్వం కృసి చేస్తోందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
2022 నాటికి 5జీ స్పెక్ట్రం వేలం పూర్తి చేసే యోచన. ప్రజా రవాణాలో ప్రత్యామ్నాయ ఇంధనలకు ప్రముఖ స్థానం. ఈ-వెహికల్స్ ప్రోత్సహకంలో భాగంగా హైవేలపై బ్యాటరీలు మార్చుకునే సదుపాయం. సోలార్ ఎనర్జీ ఉత్పత్తి కోసం 19,500 వేల కోట్ల రూ. కేటాయింపు. అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కాగిత రహిత విధానం. మానసిక ఆరోగ వ్యవస్థ కోసం జాతీయ విధానం. 10 రంగాల్లో క్లీన్‌ఎనర్జీ యాక్షన్ ప్లాన్. ఎగుమతుల ప్రోత్సాహకానికి కొత్త చట్టం. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక స్టార్టప్‌లు. ఉత్తర ప్రదేశ్‌కి భారీ పథకం. కెన్‌బెత్వా ప్రాజెక్టుతో 103 మెగావాట్ల విద్యుత్. 62 లక్షల మందికి తాగు నీరు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)