కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రజలకు శుభవార్త వినిపించాయి. రాయితీలు లేనటువంటి, వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర సుమారు రూ.91.50 వరకు తగ్గింది. అయితే గృహ వినియోగ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ వాడకందారులకు ఇటువంటి ఉపశమనం లభించలేదు. ఈ నూతన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి.

రాయితీపై లభించే గృహ వినియోగ ఎల్‌పీజీ 14.2 కేజీల సిలిండర్ ధర యథావిథిగానే ఉంటుందని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం ప్రకటించాయి. కోల్‌కతాలో 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.2,076 నుంచి రూ.1,987కు తగ్గింది. ముంబైలో ఈ సిలిండర్ ధర రూ.1,948 నుంచి రూ.1,857కు తగ్గింది. పెట్రోలు, డీజిల్ ధరలు నవంబరు నుంచి నిలకడగా ఉన్న సంగతి తెలిసిందే. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు జరగనున్న సంగతి తెలిసిందే

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)