Plane | Representational image | (Photo Credits: Getty Images)

New Delhi, Feb 1: బడ్జెట్ వేళ ఏవియేషన్ రంగానికి భారీ షాక్ తగిలింది. కరోనా ఎఫెక్ట్‌తో గత రెండేళ్లుగా భారీ నష్టాలతో నెట్టుకువస్తున్న విమానయాన రంగం, ఈ బడ్జెట్‌లో తమకేమైనా ఉద్దీపనలు లభిస్తాయనే ఆశతో ుంది. అయితే ఆ ఆశల కన్నా ముందే ఏవియేషన్‌ సెక్టార్‌ కి పెరుగుదల సెగ తగిలింది. కేంద్రం అనూహ్యంగా ఏవియేషన్‌ ఫ్యూయల్‌ ధర 8.5 శాతం (Aviation Turbine Fuel Price Hike) పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభించిన తర్వాత విమనా ప్రయాణాలపై ఆంక్షలు వచ్చాయి. ఫస్ట్, సెకండ్, ఇప్పుడు వచ్చిన థర్డ్ వేవ్ సమయంలో ప్రజలు తమ ప్రయాణాలు మానుకున్నారు. దీంతో ఏవియేషన్‌ సెక్టార్లో డిమాండ్‌ భారీగా తగ్గిపోయింది. దాదాపు అన్ని ఏవియేషన్ సంస్థలు నష్టాల బాటలోనే ఉన్నాయి. ఈ సమయంలో విమానాల్లో ఉపయోగించే వైట్‌ పెట్రోలు ధరలను 8.5 శాతం (Aviation Turbine Fuel price) పెంచడం విమానయాన సంస్థలను మళ్లీ కష్టాల్లోకి నెట్టినట్లయింది. ఇప్పటికే డిమాండ్‌ తగ్గిపోయిన తరుణంలో టిక్కెట్ల రేట్లను పెంచాలా ? లేక పెరిగిన ఛార్జీలను భరించాలా ? అనేది ఆ సంస్థలకు ఇబ్బందికర అంశంగా మారింది.

బడ్జెట్‌కు ముందే భారీగా తగ్గిన సిలిండర్ ధర, వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.91.50 వరకు తగ్గింపు, తగ్గని గృహ వినియోగ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ ధర

గతేడాది మే నుంచి కేంద్రం పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుకుంటూ పోయింది. కేవలం నాలుగు నెలల కాలంలోనే అంతర్జాతీయ చమురు ధరల వంకతో లీటరు పెట్రోలు, డీజిల్‌లపై సగటున రూ.25 వంతున పెంచింది. దీంతో కేంద్రంపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో కంటి తుడుపు చర్యగా 2021 నవంబరులో లీటరు పెట్రోలు, డీజిల్‌లపై రూ.5 ధర తగ్గించింది. తాజాగా రష్యా, ఉక్రెయిన్‌ వివాదం తెర మీదికి వచ్చాక.. మరోసారి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. దీనికి తగ్గట్టుగా సాధారణ ఫ్యూయల్‌ ధరలు పెంచే అవకాశం లేకపోవడంతో వైట్‌ పెట్రోల్‌ ధరలు పెంచింది.