IPL Auction 2025 Live

Union Cabinet Meeting Highlights: పీఎం సూర్యఘర్‌ పథకం కింద కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్‌, ఉచిత కరెంటు కోసం దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో..

ఇందులో భాగంగా సౌర విద్యుత్తుపై కేంద్ర స‌ర్కారు కొత్త ప‌థ‌కం పీఎం సూర్య ఘ‌ర్ ముఫ్త్ బిజిలీ యోజ‌న(PM Surya Ghar Muft Bijli Yojana) ప‌థ‌కానికి ఇవాళ కేంద్ర క్యాబినెట్ ఆమోదం ద‌క్కింది.

Union Minister Anurag Thakur (Photo-ANI)

New Delhi, Feb 29: సౌర విద్యుత్‌ వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్య పౌరులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సౌర విద్యుత్తుపై కేంద్ర స‌ర్కారు కొత్త ప‌థ‌కం పీఎం సూర్య ఘ‌ర్ ముఫ్త్ బిజిలీ యోజ‌న(PM Surya Ghar Muft Bijli Yojana) ప‌థ‌కానికి ఇవాళ కేంద్ర క్యాబినెట్ ఆమోదం ద‌క్కింది.దీంతో పాటుగా భారతదేశంలో ప్రధాన కార్యాలయంతో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

1993 వరుస బాంబు పేలుళ్ల కేసు, అబ్దుల్ కరీం తుండాను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు

ఈ పథకంలో భాగంగా సోలాప్ ప‌వ‌ర్ సిస్ట‌మ్స్‌ను ఏర్పాటు చేసేందుకు కావాల్సిన ఖ‌ర్చులో కేంద్ర ప్ర‌భుత్వం సుమారు రూ. 78 వేలు ఇవ్వ‌నున్న‌ది. దేశ‌వ్యాప్తంగా దాదాపు కోటి ఇళ్లకు ఈ ప‌థ‌కం అమలు అయ్యేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. పీఎం సూర్య ఘర్‌ పథకాన్ని రూ.75 వేల కోట్ల పెట్టుబడితో తీసుకొస్తున్నారు. ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించి కోటి కుటుంబాల్లో వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం కింద అందించే సబ్సిడీలను నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రధాని మోదీ గతంలోనే తెలియజేశారు.ఫిబ్ర‌వ‌రి 13వ తేదీన ఈ స్కీమ్‌ను ప్ర‌ధాని మోదీ లాంచ్ చేసిన విష‌యం తెలిసిందే.

Here's Video

కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణ‌యాల‌ను (Union Cabinet Meeting Highlights) కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇవాళ మీడియాకు వెల్ల‌డించారు. ప్ర‌ధాని మోదీ నేతృత్వంలో ఇవాళ క్యాబినెట్ భేటీ జ‌రిగింద‌ని, ఉచిత క‌రెంటు ప‌థ‌కానికి ఆమోదం ద‌క్కింద‌ని, ఈ స్కీమ్ కింద కోటి మంది కుటుంబాల‌కు 300 యూనిట్ల క‌రెంటు ప్ర‌తి నెల‌ ఉచితంగా ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇక 2025 నాటికి అన్ని కేంద్ర ప్ర‌భుత్వ బిల్డింగ్‌లపై రూఫ్‌టాప్ సోలార్ ప‌వ‌ర్‌ను ఏర్పాటు చేయ‌నున్నట్లు మంత్రి చెప్పారు.

ఈ సోలార్‌ ప్యానళ్ల ఏర్పాటుకు వెబ్‌సైట్‌లో గృహ వినియోగదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.ఈ పథకం కింద 1 kW విద్యుత్తును ఉత్పత్తి చేసే సోలార్ సిస్టమ్‌కు రూ.30,000 సబ్సిడీ, 2 kW సిస్టమ్‌కు రూ.60,000, 3 kW లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన సోలార్ వ్యవస్థకు రూ.78,000 సబ్సిడీని అందిస్తోంది. మిగిలినది బ్యాంకు రుణం కల్పిస్తారు. జాతీయ పోర్టల్ ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉచిత విద్యుత్ పథకం రాయితీ పథకానికి దరఖాస్తు చేసుకోండిలా..

1) బిజిలీ పథకం లింక్ క్లిక్ చేయండి. లింక్ కోసం క్లిక్ చేయండి

2) రూఫ్‌టాప్ సోలార్ కోసం అప్లై అనే బటన్ నొక్కండి.

3) రాష్ట్రం, విద్యుత్ పంపిణీ సంస్థ, కుటుంబ సభ్యుల సంఖ్య, మొబైల్ నంబర్, ఈ - మెయిల్ వివరాలు ఎంటర్ చేయాలి.

4) తరువాతి దశకు వెళ్లడానికి మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ చేయండి.

5) అలా చేసిన తరువాత పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు అప్లికేషన్ ఏ దశలోనైనా బ్యాంక్ వివరాలను సమర్పించొచ్చు.

6) ప్యానళ్లు ఇన్‌స్టాల్ చేసే వ్యక్తిని సంప్రదించాలి.

7) ఇన్‌స్టాలేషన్ పూర్తయిన తర్వాత, ప్లాంట్ వివరాలను సమర్పించి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోండి.

8) నెట్ మీటర్‌ను ఇన్‌స్టాల్ చేశాక డిస్కం తనిఖీ చేసిన తర్వాత పోర్టల్ నుంచి కమీషనింగ్ సర్టిఫికేట్ రూపొందుతుంది.

9) కమీషనింగ్ నివేదిక పొందిన తర్వాత పోర్టల్ ద్వారా బ్యాంక్ ఖాతా వివరాలు, రద్దయిన చెక్కును సమర్పించండి. ఇలా చేసిన 30 రోజుల్లోగా బ్యాంక్ ఖాతాలో సబ్సిడీని అందుకుంటారు.



సంబంధిత వార్తలు