Ashwini Vaishnaw Reaction on Allu Arjun arrest: అల్లు అర్జున్ అరెస్ట్ ను తప్పుబట్టిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, క్రియేటివ్ ఇండస్ట్రీపై గౌరవం లేదా? అంటూ ప్రశ్న
క్రియేటివ్ ఇండస్ట్రీపై కాంగ్రెస్‌కు గౌరవం లేదని మరోసారి రుజువైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం వైఫల్యంతోనే సంధ్య థియేటర్ వద్ద దుర్ఘటన చోటుచేసుకుందన్నారు.
New Delhi, DEC 13: అల్లు అర్జున్ అరెస్టుపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) స్పందించారు. క్రియేటివ్ ఇండస్ట్రీపై కాంగ్రెస్‌కు గౌరవం లేదని మరోసారి రుజువైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం వైఫల్యంతోనే సంధ్య థియేటర్ వద్ద దుర్ఘటన చోటుచేసుకుందన్నారు. అల్లు అర్జున్ అరెస్టు (Allu Arjun arrest) నేపథ్యంలో ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Ashwini Vaishnaw Reaction on Allu Arjun arrest
‘‘క్రియేటివ్ ఇండస్ట్రీపై కాంగ్రెస్‌కు గౌరవం లేదనే విషయం అల్లు అర్జున్ అరెస్టుతో మరోసారి రుజువైంది. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం పేలవమైన ఏర్పాట్లతోనే సంధ్య థియేటర్ వద్ద దుర్ఘటన జరిగింది. ఈ లోపాలను కప్పిపుచ్చుకునేందుకే.. ప్రభుత్వం ఇప్పుడు ప్రయత్నాలు చేస్తోంది. సినీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకోవడం కాకుండా బాధితులను ఆదుకోవడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించాలి. ఆ రోజు ఏర్పాట్లు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఏడాది కాలంలో ఇలాంటి ఘటనలు వరుసగా కొనసాగడం బాధాకరం’’ అని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.