Bandi Sanjay: జన్వాడ ఫాం హౌస్ కేసులో కాంప్రమైజ్ అయిన బీఆర్ఎస్ - కాంగ్రెస్, అందుకే మేమిద్దరం కేటీఆర్ కలలోకి వస్తున్నామన్న బండి సంజయ్

మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన సంజయ్..రేవంత్ ఆరు గ్యారంటీలను అమలు చేస్తా అని పాదయాత్ర చేయాలన్నారు. రేవంత్, బండి సంజయ్ ఒక్కటేనని కేటీఆర్ చేసిన కామెంట్స్ పై కౌంటర్ ఇచ్చారు.

Union Minister Bandi Sanjay Chit Chat with Media(X)

Hyd, Nov 8:  రేవంత్ రెడ్డి సంగెం వద్ద పాదయాత్ర కాదు, చేతనైతే మూసీ పక్కన ఇండ్లు కోల్పోయే బాధిత ప్రాంతాల్లో దగ్గర పాదయాత్ర చేయాలన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్. మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన సంజయ్..రేవంత్ ఆరు గ్యారంటీలను అమలు చేస్తా అని పాదయాత్ర చేయాలన్నారు.

రేవంత్, బండి సంజయ్ ఒక్కటేనని కేటీఆర్ చేసిన కామెంట్స్ పై కౌంటర్ ఇచ్చారు.

కేటీఆర్ కు తొంగి చూసే బుద్దిలే ఉన్నాయన్నారు. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి, తాను కొట్లడామని అందుకే మేమిద్దరం కేటీఆర్ కలలోకి వస్తున్నామని చెప్పారు. డైవర్షన్, కాంప్రమైజ్ పాలిటిక్స్ చేసే అలవాటు కేటీఆర్ కే ఉందన్నారు. జన్వాడా ఫామ్‌ హౌస్ కేసు లో కాంగ్రెస్ -బీఆర్ఎస్ కాంప్రమైజ్ అయ్యారు అని...

ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు కేసులన్నీ హంగామా చేసి చివరకు కాంప్రమైజ్ అవుతున్నారు అన్నారు.

బీజేపీకి స్పేస్ లేకుండా చేయాలని కాంగ్రెస్ - BRS కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు సంజయ్. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు కాకుండా, ఎన్నికలు వచ్చినప్పుడు బయటకు వస్తె వాళ్ళు లీడర్ అవుతారా ? చెప్పాలన్నారు. బీఆర్ఎస్ ఇప్పుడు లేదు ఇక ముందు ఉండదన్నారు. ప్రజా నిర్ణయం ప్రకారం ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాం అన్నారు. బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు...బీఆర్ఎస్ నేత కేసీఆర్ రెస్ట్‌లో ఉన్నారు...కేసీఆర్ కొడుకు యాక్టింగ్ చేస్తున్నారు అని ఎద్దేవా చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయడానికి బీఆర్ఎస్‌కి అభ్యర్థులు దొరకడం లేదని, అభ్యర్థులు లేకపోవడంతో పోటీకి దూరంగా ఉంటున్నామని అంటున్నారు అన్నారు.

సర్పంచ్ ల పొట్టగొట్టిందే BRS సిగ్గు లేకుండా వాళ్ళ దగ్గరకు మళ్ళీ వెళ్తున్నారు అని దుయ్యబట్టారు. సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మోసం చేసిందని...BRS లో కెసిఅర్ కొడుకును ఎవరు పట్టించుకోవడం లేదు అన్నారు.   కేటీఆర్‌పై బండి సంజయ్ ఫైర్, కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ యాక్టివ్ సీఎం, కాంగ్రెస్‌ - బీఆర్ఎస్ కలిసి బీజేపీపై కుట్ర చేస్తున్నాయని ఆగ్రహం

కేటీఆర్ కళ్ళు నెత్తికి ఎక్కాయి...బీఆర్ఎస్‌లో క్రెడిబులిటీ ఉన్న లీడర్ హరీష్ రావు అన్నారు. ప్రధానిపై ఇష్టరీతిగా మాట్లాడితే సహించేది లేదు అన్నారు. టివిలో, ట్విట్టర్లో తప్ప కేటీఆర్ ఎక్కడ కనిపించడం లేదు అన్నారు. సోషల్ మీడియాలో రేవంత్, బండి సంజయ్ ఒక్కటేనని ప్రచారం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుందన్నారు. నేను రేవంత్ ఒక్కటే అని చెప్పడానికి ఒక్క ఉదాహరణ చెప్పాలన్నారు.

గతంలో కెసిఅర్ గవర్నర్ కు ప్రోటోకాల్ ఇవ్వలేదు... గవర్నర్ ఖమ్మం వెళ్తానంటే కనీసం హెలికాప్టర్ ఇవ్వలేదు అన్నారు. రేవంత్ గుర్తుపెట్టుకో !, నీ బిడ్డ పెళ్లికి కూడా వెళ్లకుండా ఇబ్బంది పెట్టారు... నిన్ను జైలుకు పంపించారు..జైలుకు పంపించిన వారితో కాంప్రమైజ్ అవుతున్నారా? చెప్పాలన్నారు. రేవంత్.. కేటీఆర్ మధ్య ఒప్పందం ఉంది కాబట్టే కేటీఆర్ ను అరెస్ట్ చేయడం లేదు అన్నారు.



సంబంధిత వార్తలు

Weather Forecast: నెల్లూరు జిల్లాకు అలర్ట్, బలహీనపడి అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన

CM Revanth Reddy: తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు..సినీ పెద్దలతో తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా ఉండాలని సూచించిన తెలంగాణ సీఎం

Kamareddy: వివాహేతర సంబంధం...ముగ్గురి ప్రాణాలు తీసింది, ఎస్సై సహా మహిళా కానిస్టేబుల్ మరోకరి ఆత్మహత్య..కామారెడ్డిలో సంచలనంగా మారిన ముగ్గురి ఆత్మహత్యలు