Uttar Pradesh: పెళ్లి వేడుకల్లో విషాదం, బావిలో పడి 13 మంది మృతి, బావిపై నిల్చొని వేడుక చూస్తుండగా ఘటన, మృతులంతా మహిళలే, వారిలో 9 మంది బాలికలు

వివాహ వేడుకలో భాగంగా జరిగే హల్దీ వేడుకలో(haldi ceremony) అపశృతి చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు 13 మంది మహిళలు బావిలో పడి మృతి చెందారు. వీరిలో 9 మంది బాలికలు ఉన్నారు. ఖుషీనగర్ (Kushinagar) జిల్లా నెబువా నౌరంజియాలో (Nebua Naurangia) వివాహ వేడుకలో భాగంగా హల్దీ ఫంక్షన్ జరుగుతోంది.

Luknow, Feb 17: ఉత్తరప్రదేశ్‌లో( Uttar Pradesh) ఘోర ప్రమాదం జరిగింది. వివాహ వేడుకలో భాగంగా జరిగే హల్దీ వేడుకలో(haldi ceremony) అపశృతి చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు 13 మంది మహిళలు బావిలో పడి మృతి చెందారు. వీరిలో 9 మంది బాలికలు ఉన్నారు. ఖుషీనగర్ (Kushinagar) జిల్లా నెబువా నౌరంజియాలో (Nebua Naurangia) వివాహ వేడుకలో భాగంగా హల్దీ ఫంక్షన్ జరుగుతోంది.

ఈ క్రమంలో కొంతమంది మహిళలు, యువతులు బావి పైకప్పుపై నిల్చున్నారు.బరువు అధికమవ్వడంతో పైకప్పు ఒక్కసారిగా ప్పకూలిపోయింది. దీంతో అందరూ బావిలో పడిపోయారు. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారని పోలీసులు పేర్కొన్నారు. మరో 15 మందిని గ్రామస్తులు రక్షించారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా (ex-gratia ) ప్రకటించారు.

Indonesia: స్కూలులో కామాంధుడుగా మారిన టీచర్, 13 మంది విద్యార్థినులపై దారుణంగా అత్యాచారం, గర్భం దాల్చిన ఎనిమిది మంది, నిందితుడికి యావజ్జీవ శిక్ష విధించిన ఇండోనేషియా కోర్టు

ఖుషీనగర్‌లో జరిగిన ఘటనపై రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ స్పందించారు. ఈ ఘటనను హృదయ విదారకంగా అభివర్ణించారు. మరణించిన కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు