Triple Talaq for Car: కట్నంగా కారు ఇవ్వలేదని ఫోన్‌లోనే త్రిపుల్ తలాక్‌ చెప్పిన వ్యక్తి, కొత్త జాబ్ వచ్చింది కొన్నాళ్లూ మీ ఇంటికి వెళ్లు అంటూ...భార్యను పుట్టింటికి పంపిన తర్వాత తలాక్ చెప్పాడు, ఐదేళ్ల నుంచి అత్తింటివారిని కారుకోసం వేధిస్తున్న ఇమ్రాన్

ఆ తరువాత కొన్ని రోజులకు తనకు భర్త ఫోన్ చేసి మూడు సార్లు తలాక్ చెప్పాడని ఇక నువ్వు నాకు భార్యవు కాదు అని చెప్పాడని రుబీనా తెలిపింది.ట్రిపుల్ తలాక్ చెప్పి కాల్ డిస్‌కనెక్ట్ చేశాడని రుబీనా తెలిపింది.తనను తన పుట్టింటిలో వదలిని సమయంలో తన అత్తమామలు తన నగలు, ఇతర వస్తువులనుకూడా పట్టుకుపోయారని తెలిపింది.

Image used for representational purpose only | (Photo Credits: Pixabay)

Ghaziabad, OCT 15: ట్రిపుల్ తలాక్ (triple talaq ) నుంచి ముస్లిం మహిళలకు రక్షణ కల్పించేందుకు చట్టం వచ్చినా ‘తలాక్ (triple talaq ) అని మూడుసార్లు చెప్పి భార్యలను వదిలించుకునే జాడ్యం పోవటంలేదు. కట్నంగా డబ్బుల నగలు దోచిపెట్టలేదనో..అధిక కట్నం తేలేదనో..మగపిల్లాడు పుట్టలేదనో..రెండో పెళ్లి చేసుకోవాలనే దురాశతోనే భార్యలను వదిలించుకోటం తలాక్ అనే మూడుమార్లు పలికే మాటతో పరిపాటిగా మారిపోయింది. ఈక్రమంలో అటువంటిజరిగింది ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ (Ghaziabad) లో. లక్షల రూపాయల కట్నం తీసుకున్నా అతగాడికి కారు (Car) ఇవ్వలేదని భార్యకు ఫోన్ చేసి మూడుసార్లు తలాక్ అని చెప్పేసి ఇక నీకూ నాకూ ఎటువంటి సంబంధంలేదని తేల్చిపారేశాడు ఓ భర్త. దీంతో ఆమె తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది.ఘజియాబాద్‌లోని (Ghaziabad) కొత్వాలి పోలీస్ స్టేషన్‌లోని కైలా బట్టీ ప్రాంతంలో కట్నంతో పాటు కారు ఇవ్వలేదని తన భర్తతో పాటు అత్తమామలు కూడా వేధించారని తన భర్త తనకు తలాక్ చెప్పి నీకు నాకు ఇక ఎటువంటి సంబంధంలేదు పొమ్మంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ మహిళ. తన భర్తతో సహా ఐదుగురిపై ఫిర్యాదు చేసింది.

Ekta Kapoor: యువతను చెడగొడుతున్నావ్! ఏక్తా కపూర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం, XXX వెబ్‌ సిరీస్‌పై కేసులో ఏక్తాకు ఎదురదెబ్బ, ప్రతిసారి కోర్టును ఆశ్రయించడం సరికాదు, కోర్టు ఉన్నది నోరులేని వారికోసం, ఏక్తాకపూర్‌పై అరెస్ట్ వారెంట్, కేసును సమర్ధించిన అత్యున్నత న్యాయస్థానం 

కైలా భట్టా నివసిస్తున్న రుబీనాకు నివారీకి (Rubina nivari) చెందిన ఇమ్రాన్ సైఫీతో (Imran saifi) డిసెంబర్ 2017లో వివాహం జరిగింది. వీరికి 4 సంవత్సరాల పాప ఉంది. పెళ్లయినప్పటి నుంచి కట్నం కోసం వేధిస్తున్నాడని..శారీరకంగా, మానసికంగా అత్తమామలు వేధించారని సదరు యువతి వాపోయింది. కట్నం వేధింపులను భరించలేని రుబీనా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అత్తమామలు దిగి వచ్చారు. రుబీనాతో రాజీ కుదుర్చుకున్నారు. కొంతకాలానికి భర్త ఇమ్రాన్ సైఫ్ రాజస్థాన్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం వచ్చిందని చెప్పి రుబీనాను మీ అమ్మాగారి ఇంటికి వెళ్లు నేను కొన్ని రోజుల తరువాత వచ్చి తీసుకెళతానని చెప్పారు. అది నమ్మింది రుబీనా.

Intelligence Alert: తెలంగాణలో భారీ విధ్వంసానికి పీఎఫ్‌ఐ కుట్ర, ఇంటలిజెన్స్ పోలీసుల హెచ్చరిక, ఆర్‌ఎస్‌ఎస్‌- హిందూ ధార్మిక సంస్థలే లక్ష్యంగా దాడుల చేసే అవకాశం, సున్నిత ప్రాంతాల్లో భద్రత పెంపు 

దీంతో ఇమ్రాన్ రుమీని అత్తవారింట్లో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఆ తరువాత కొన్ని రోజులకు తనకు భర్త ఫోన్ చేసి మూడు సార్లు తలాక్ చెప్పాడని ఇక నువ్వు నాకు భార్యవు కాదు అని చెప్పాడని రుబీనా తెలిపింది.ట్రిపుల్ తలాక్ చెప్పి కాల్ డిస్‌కనెక్ట్ చేశాడని రుబీనా తెలిపింది.తనను తన పుట్టింటిలో వదలిని సమయంలో తన అత్తమామలు తన నగలు, ఇతర వస్తువులనుకూడా పట్టుకుపోయారని తెలిపింది.రుబీనా ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని నగర్ కొత్వాలి ఇన్‌ఛార్జ్ అమిత్ కుమార్ ఖరీ తెలిపారు. త్వరలో మహిళ అత్తమామలను అరెస్టు చేయనున్నామని తెలిపారు.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Formula E Race Case: ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసు, దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని కేటీఆర్ సవాల్, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతామని ప్రకటించిన బీఆర్ఎస్

Tamil Nadu Shocker: అతుల్ సుభాష్ సూసైడ్ ఘటన మరువక ముందే మరో భార్యా భాధితుడు ఆత్మహత్య, కొడుకు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు కూడా ఆత్మహత్య