UP Shocker: యూపీలో దారుణం, యువతి రక్తంతో రోడ్డు మీద పడి ఉంటే సెల్ఫీలు దిగుతూ చోద్యం చూసిన స్థానికులు,బాధితురాలిని భుజం మీద వేసుకుని ఆస్పత్రికి తీసుకువెళ్లిన పోలీస్

యువతి తీవ్రగాయలపాలై (After Teen Girl Found Bleeding) నిస్సహాయ స్థితిలో ఉంటే స్థానికులు సాయం అందించకపోగా చుట్టూ చేరి మొబైల్‌ ఫోన్‌తో ఫోటోలు తీస్తున్నారు.

Representational Image | (Photo Credits: IANS)

Lucknow, Oct 25: ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లోని కలతపెట్టే వీడియోలో, తీవ్రంగా గాయపడిన ఒక యువతి, సహాయం కోసం వేడుకుంటుంది, అయితే కొంతమంది వ్యక్తులు ఆమె చుట్టూ నిలబడి మొబైల్ ఫోన్‌లలో చిత్రీకరిస్తున్నారు. యువతి తీవ్రగాయలపాలై (After Teen Girl Found Bleeding) నిస్సహాయ స్థితిలో ఉంటే స్థానికులు సాయం అందించకపోగా చుట్టూ చేరి మొబైల్‌ ఫోన్‌తో ఫోటోలు తీస్తున్నారు.

కాగా ఆ యువతి ఇంటి నుంచి అదృశ్యమైన కొద్ది గంటల్లోనే తీవ్ర గాయాలపాలై కనిపించింది. ఆ 13 ఏళ్ల బాధిత యువతికి తలతో సహ ఒంటిపై పలుచోట్ల తీవ్రగాయాలయ్యాయి. ఆమె ఒకవైపు నుంచి సాయంచేయమంటూ అక్కడ ఉన్నవారిని అభ్యర్థిస్తుంది. కానీ అక్కడ ఉన్న స్థానికులంతా ఆమె చుట్టూ చేరి సెల్‌ఫోన్‌తో ఫోటోలు తీసే బిజీలో ఉన్నారు.

వరంగల్ ఆస్పత్రిలో రోగి మంచం కింద నాగుపాము, ఒక్కసారిగా ఉలిక్కిపడిన రోగులు, సిబ్బంది, అటెండర్లు, ఆస్పత్రిలో ఇలాంటి ఘటన జరగడం ఈ నెలలో ఇది రెండోసారి

ఒక్కరూ కూడా పోలీసులు వచ్చేదాకా ఆమెకు ఎలాంటి సాయం అందించలేదు.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సదరు బాధిత యువతిని ఆటోరిక్షాలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సూపరింటెండెంట్‌ కున్వార్‌ అనుపమ్‌ సింగ్‌ తెలిపారు.

Here's Video

బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఐతే ఆమెపై లైంగికదాడి జరిగిందా లేదా అనేది ఇంకా తెలియరాలేదని, అలాగే ఇంకా ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు.వైరల్‌గా మారిన రెండవ వీడియో, గాయపడిన అమ్మాయిని తన చేతుల్లో ఉంచుకుని ఒక పోలీసు ఆటోరిక్షా వద్దకు పరుగెత్తడాన్ని చూపించింది.

ఆమె ఆదివారం పిగ్గీ బ్యాంక్ కొనడానికి బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని ఉన్నతాధికారిని ఉటంకిస్తూ వార్తా సంస్థ పిటిఐ తెలిపింది. అతిథి గృహంలోని గార్డు మొదట ఆమె నొప్పితో కొట్టుమిట్టాడుతున్నట్లు గుర్తించి, పోలీసులను అప్రమత్తం చేసాడు. ఒక యువకుడు ఆమెతో పాటు వచ్చినట్లు తెలుస్తోంది. వారు గెస్ట్ హౌస్ వద్ద ఉన్న సెక్యూరిటీ కెమెరా ఫుటేజీలో కనిపించారు, Mr సింగ్ అతని గుర్తింపును నిర్ధారిస్తున్నట్లు తెలిపారు.బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు.