Donald Trump Arrived: భారత్ చేరుకున్న డొనాల్డ్ ట్రంప్, అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానం
ట్రంప్ ఫ్యామిలీకి ఆహ్వానం పలికేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే విమానాశ్రయానికి చేరుకున్నారు. ...
Ahmedabad, February 24: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కాసేపటి క్రితమే భారత్ చేరుకున్నారు. సోమవారం ఉదయం 11:50 సమయంలో అమెరికా అధ్యక్షుడి విమానం ఎయిర్ ఫోర్స్ వన్ అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ (Touchdown) అయింది. ట్రంప్ ఫ్యామిలీకి ఆహ్వానం పలికేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే విమానాశ్రయానికి చేరుకున్నారు. అగ్రరాజ్య నేతకు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వబడుతుంది , ఆ తర్వాత విశిష్ట అతిథుల కోసం ఏర్పాటు చేసిన చిన్న సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది.
భారత పర్యటనలో భాగంగా తొలిరోజు ట్రంప్ తన ఫ్యామిలీతో కలిసి ఈరోజు అహ్మదాబాద్ మరియు ఆగ్రా నగరాలను సందర్శించనున్నారు, విమానాశ్రయం నుంచి ముందుగా ఆయన మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శనకు వెళ్తారు. పీఎం మోదీ, అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా కలిసి అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. అహ్మదాబాద్ వీధుల్లో రోడ్డుకు ఇరువైపులా లక్షలాది మంది జేజేలతో గ్రాండ్ రోడ్‌షో ఉంటుంది.
Watch Live:
మొత్తంగా 36 గంటల పాటు డొనాల్డ్ ట్రంప్ మరియు వారి ఫ్యామిలీ భారత్ లో గడపనున్నారు. ట్రంప్ భారత పర్యటన పూర్తి షెడ్యూల్ ఈ లింక్ క్లిక్ చేసి పొందండి.
మొతెరాలో నిర్మించబడుతున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంను ప్రధాని మోదీ, యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ సంయుక్తంగా ప్రారంభిస్తారు. ఈ స్టేడియం లక్ష మందికి పైగా కూర్చునే సామర్థ్యం కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా అవతరించనుంది.
మొతెరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్' (Namaste Trump) ఈవెంట్ జరగనుంది. లక్షలుగా తరలివచ్చే జనాలను ఉద్దేశించి పీఎం మోదీ, అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగించనున్నారు.
షెడ్యూల్ ప్రకారం, ప్రెసిడెంట్ ట్రంప్ మధ్యాహ్నం 3:30 గంటలకు ఆగ్రాకు బయలుదేరుతారు. సాయంత్రం 4:30 గంటలకు ఆగ్రా చేరుకుంటారు. వారికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆహ్వానం పలుకుతారు.
సాయంత్రం 5 గంటలకు తాజ్ మహల్ సందర్శన, అరగంట తాజ్‌మహల్ వద్ద గడిపి, అక్కడ్నించి నేరుగా దిల్లీ బయలుదేరి వెళ్తారు.