Uttar Pradesh Horror: యూపీలో దారుణం, దళిత యువతిపై ముస్లిం యువకులు సామూహిక అత్యాచారం, వీడియో తీసి రూ. 5 లక్షలు డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్
దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళపై (Dalit woman) ఇద్దరు ముస్లిం యువకులు (two Muslim men) సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అంతే కాకుండా ఈ దారుణాన్ని వీడియో తీశారు. ఆ మహిళ చేత బలవంతంగా బీఫ్ తినిపించారు.
Bareilly, Sep 8: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని బరేలీ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళపై (Dalit woman) ఇద్దరు ముస్లిం యువకులు (two Muslim men) సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అంతే కాకుండా ఈ దారుణాన్ని వీడియో తీశారు. ఆ మహిళ చేత బలవంతంగా బీఫ్ తినిపించారు.
బరేలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బరేలీ (Bareilly) జిల్లాకు చెందిన దళిత యువతి తన ముస్లిం స్నేహితురాలికి కొంత డబ్బును అప్పుగా ఇచ్చింది. దాన్ని తిరిగి ఇవ్వాలని ఆమె కోరింది. దీంతో సెప్టెంబర్ 2వ తేదీన ఓ కేఫ్‌కు రావాలని దళిత యువతికి ముస్లిం స్నేహితురాలు ఫోన్ చేసి చెప్పింది. ఈ నేపథ్యంలో దళిత యువతి తన స్నేహితురాలు చెప్పిన కేఫ్ దగ్గరకు వెళ్లింది.
అక్కడ తన స్నేహితురాలితో పాటు మరో ఇద్దరు ముస్లిం యువకులు ఉన్నారు. అందులో ఒకరు బీఫార్మసీ విద్యార్థి షోయబ్ కాగా.. మరొకరు బార్బర్ గా పనిచేసే నజీమ్.వీరు ముగ్గురూ కలిసి దళిత యువతిని ఓ హోటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆ యువకులు ఆమెతో బలవంతంగా బీఫ్ తినిపించారు. అనంతరం ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ తతంగాన్ని అంతా వీడియో తీశారు. ఆ వీడియోను అడ్డుపెట్టుకుని ఆమెను బెదిరించడం మొదలు పెట్టారు. రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆమె అడిగిన డబ్బు ఇవ్వకపోవడంతో ఆ వీడియోని యువతికి కాబోయే భర్తకు పంపించారు. దీంతో విసిగిపోయిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయం గురించి పోలీసులకు వివరించింది. ఈ మేరకు నిందితులపై కేసు పెట్టింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులందరినీ అరెస్టు చేశారు.