Ram Janmabhoomi Bomb Threat: అయోధ్య రామ మందిరాన్ని పేల్చేస్తాం.. అయోధ్యవాసికి ఆగంతకుడి ఫోన్.. పోలీసుల దర్యాప్తు
అప్రమత్తమైన స్థానిక వ్యక్తి ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Ayodhya, Feb 3: గురువారం ఉదయం 10 గంటలకు అయోధ్యలో (Ayodhya) నిర్మాణంలో ఉన్నరామ మందిరాన్ని (Ram Mandir) పేల్చేస్తామంటూ ఓ దుండగుడు స్థానికుడు మనోజ్ కుమార్ కు ఫోన్ చేశాడు. అప్రమత్తమైన స్థానిక వ్యక్తి ఈ విషయాన్ని పోలీసులకు (Police) చేరవేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా రామ మందిరం పేల్చివేతకు ఉగ్రవాదులు కుట్రలు పట్టినట్లు గత నెలలో కూడా భారత నిఘా వర్గాలు గుర్తించాయి..నిఘా వర్గాల హెచ్చరికల తరువాత అయోధ్యతో భద్రతను కట్టుదిట్టం చేశారు.
నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. వాడీవేడి చర్చకు అధికార, విపక్షాలు సిద్ధం
సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టారు. అయోధ్య రామమందిరం వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదిన ప్రారంభమవుతుందని కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలోనే రామమందిరంపై ఉగ్రదాడి జరిగేందుకు జైషే మహ్మద్ ఉగ్రవాదులు కుట్రపన్నారని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. అయోధ్య రామమందిరం దగ్గర జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి కుట్ర చేసినట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. అయోధ్య రామమందిరంపై ఉగ్రవాదులు రెక్కీ చేసినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. నేపాల్ నుంచి ఉత్తరప్రదేశ్ లోకి ప్రవేశించేందుకు టెర్రరిస్టులు ప్రయత్నిస్తునట్టు ఐబీ హెచ్చరించింది.. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఆయోధ్య రామమందిరం వద్ద భద్రతను మరింత పెంచారు.