Uttar Pradesh Shocker: కామాంధులుగా మారిన పోలీస్ కానిస్టేబుల్స్,యూపీలో యువతిని రూంలో బంధించి దారుణంగా అత్యాచారం, కేసు నమోదు చేసిన ఉన్నతాధికారులు

రక్షణ కల్పించాల్సిన పోలీసులే కామాంధులయ్యారు. 23 ఓ ఏళ్ల యువతిపై ఇద్దరు పోలీసులు అత్యాచారానికి పాల్పడిన ఉదంతం (Constable Brothers Gang-Rape Woman) షమ్లీ జిల్లాలో వెలుగు చూసింది.

Credits: Google

Lucknow, May 3: యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రక్షణ కల్పించాల్సిన పోలీసులే కామాంధులయ్యారు. 23 ఓ ఏళ్ల యువతిపై ఇద్దరు పోలీసులు అత్యాచారానికి పాల్పడిన ఉదంతం (Constable Brothers Gang-Rape Woman) షమ్లీ జిల్లాలో వెలుగు చూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఇమ్రాన్‌ మీర్జా అనే వ్యక్తి పిలిభిత్‌ జిల్లాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి 2021 మార్చిలో ఫేస్‌బుక్‌ ద్వారా యువతి పరిచయమైంది. అది ప్రేమగా మారింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు హోటళ్లకు తీసుకెళ్లి పాడుపనికి పాల్పడ్డాడు. అనంతరం షమ్లీలో ఫ్లాట్‌ అద్దెకు తీసుకొని యువతికి వసతి కల్పించాడు.

వరంగల్ జిల్లాలో దారుణం, మహిళను అడవిలోకి లాక్కెళ్లి ముగ్గురు సామూహిక అత్యాచారం, సహకరించిన మరో ఇద్దరు మిత్రులు

అయితే అక్కడ నివసించే సమయంలో మీర్జా సోదరుడు ఫుర్కాన్(కానిస్టేబుల్‌) కూడా తనపై అత్యాచారం చేశాడని యువతి ఆరోపించింది.ఇద్దరు సోదరులైన కానిస్టేబుళ్లు తనను రోజుల తరబడి నిర్భంధంలో ఉంచి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండుసార్లు గర్భవతి అయితే బలవంతంగా అబార్షన్‌ (Force Her To Abort Twice)చేయించినట్లు ఆరోపించింది. ఈ విషయం బయటపెడతానని ఇమ్రాన్‌ తనను దారుణంగా కొట్టారని తెలిపింది.

అమ్మాయి దొరికిందని అదే పనిగా శృంగారం చేస్తుంటే, అంగం యోనిలో ఇరుక్కొని ఫ్రాక్చర్ అయి విరిగిపోయింది..వామ్మో అసలు ఏం జరిగింది..

ఈ క్రమంలోనే వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకొని.. కేసు నమోదు చేసినట్లు పేర్కొంది.. అయితే ఇప్పుడు కూడా కేసును ఉపసంహరించుకోవాలని ఇమ్రాన్ అతని సోదరుడు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పిలిభిత్‌ ఎస్పీ అతుల్‌ శర్మ తెలిపారు. ఇద్దరు కానిస్టేబుళ్లు దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.