Representational Image (Photo Credits: Pixabay)

ఢిల్లీకి చెందిన 32 ఏళ్ల ఓ యువకుడు శృంగారం చేస్తున్న సమయంలో కక్కుర్తి ఆపుకోకుండా ఇష్టం వచ్చినట్లు చేశాడు. దానితో స్తంభించి ఉన్న పురుషాంగాం శృంగారం చేస్తున్న సమయంలో ఫ్రాక్చర్ అయిపోయింది. ఇది ఎలాగంటే... శృంగారం చేస్తున్న సమయంలో సజావుగా చేయనప్పుడు పురుషాంగం మెలితిరిగిపోవడమో లేదంటే వేగంగా చేస్తున్న సమయంలో గబుక్కున చీరుకుపోయినట్లు అయిపోయి గాయాలు కావడం వంటివి ఫ్రాక్చర్ కిందకి వస్తాయంటున్నారు వైద్యులు.

ఆ యువకుడు కూడా ఇలాంటి సమస్యతో ఢిల్లీ ఆసుపత్రికి రావడంతో సమస్యను క్షుణ్ణంగా పరిశీలించారు వైద్యులు. ఇలాంటి సమస్యలు అతి తక్కువగా ఉంటాయి కనుక దీనిని బీఎంజె కేస్ రీపోర్ట్స్ మెడికల్ జర్నల్ లో ప్రచురించారు. అందులో ఫోటోలతో సహా పూర్తిగా తెలియజేశారు. పురుషాంగం ఫ్రాక్చర్ ను అలాగే వదిలేస్తే సమస్య మరింత జఠిలమవుతుందనీ, కొందరిలో అంగం స్తంభించకుండా పోతుందని వెల్లడించారు.