Char Dham Yatra: ఘోర విషాదం, చార్‌ధామ్‌ యాత్రలో 200 మందికి పైగా మృతి, కేవలం రెండు నెలల్లోనే ఈ మరణాలు చోటు చేసుకున్నాయని తెలిపిన ఉత్తరాఖండ్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌

పవిత్ర చార్‌ధామ్‌ యాత్ర గత నెల 3న ప్రారంభమైంది. అయితే రెండు నెలలు కూడా గడువకముందే 203 మంది యాత్రికులు మరణించారని ఉత్తరాఖండ్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ వెల్లడించింది.

Char Dham yatra. (Photo Credit: Wikimedia Commons)

Dehradun, june 27: 2022 చార్‌ధామ్‌ యాత్రలో ఇప్పటి వరకు రెండువందల మందికిపైగా యాత్రికులు మృత్యువాతపడ్డారు. పవిత్ర చార్‌ధామ్‌ యాత్ర గత నెల 3న ప్రారంభమైంది. అయితే రెండు నెలలు కూడా గడువకముందే 203 మంది యాత్రికులు మరణించారని ఉత్తరాఖండ్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ వెల్లడించింది. వీరిలో కేదార్‌నాథ్‌ యాత్ర మార్గంలో 97 మంది, బద్రీనాథ్‌ ధామ్‌ మార్గంలో 51 మంది, గంగోత్రి మార్గంలో 13 మంది, యమునోత్రి మార్గంలో 42 మంది ఉన్నారని తెలిపింది. గుండెపోటు, ఇతర ఆరోగ్య సమస్యలతోనే ఎక్కువ మంది చనిపోయారని పేర్కొన్నది. షాకింగ్ న్యూస్.. నైట్ క్లబ్‌లో చెల్లా చెదురుగా 17 శవాలు, మృతదేహాలపై ఒక్క గాయం కూడా లేదని తెలిపిన పోలీసులు, దక్షిణాఫ్రికాలో మిస్టరీగా మారిన కేసు

మే 3 నుంచి ఇప్పటివరు 25 లక్షల మందికిపైగా యాత్రికులు నాలుగు పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారని వెల్లడించింది. అయితే వాతావరణంలో మార్పులు, వర్షాలు పడుతుండటంతో గత వారంరోజులుగా యాత్రికుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది. కాగా, యాత్రకు రావడానికి ముందే భక్తులు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం సూచించింది.