Uttarakhand Bus Accident: లోయలో పడ్డ పెళ్లి బృందం బస్సు, ఉత్తరాఖండ్‌లో మరో విషాదం, 25 మంది మృతి, రాత్రి నుంచి కొనసాగుతున్న సహాయకచర్యలు, ముక్కలు ముక్కలయిన బస్సు, చెల్లాచెదురుగా పడిపోయిన మృతదేహాలు
పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 25 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 21 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో పౌరీ గర్వాల్ (Pauri Garhwal) జిల్లాలోని బీర్‌ఖాల్ ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగింది.
Dehradun, OCT 05: ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) ఘోర రోడ్డు ప్రమాదం (Accident) చోటు చేసుకున్నది. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 25 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 21 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో పౌరీ గర్వాల్ (Pauri Garhwal) జిల్లాలోని బీర్‌ఖాల్ ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టి, 21 మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ అశోక్ కుమార్ ధ్రువీకరించారు. ప్రమాదం సమయంలో బస్సులో 45 మంది వరకు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అయితే అతివేగం కారణంగా పెళ్లి బస్సు అదుపు తప్పి కోట్‌ద్వార్-రిఖ్నిఖాల్-బిరోఖల్ రహదారిపై సిమ్ది సమీపంలో తూర్పు నాయర్ నది లోయలో పడిపోయింది. మంగళవారం రాత్రి 7 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF) సిబ్బంది రాత్రంతా సహాయక చర్యలు చేపట్టారు. స్థానిక గ్రామస్తులు సైతం సహకారం అందించారు.
ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన రాష్ట్రపతి, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.