ఉత్తరాఖండ్‌లో మంచు కొండచరియలు విరిగిపడడంతో దాదాపు 28 మంది పర్వతారోహకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస​్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ ఘటనపై ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి స్పందించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. ద్రౌపది దండ-2 పర్వతంలో హిమపాతం కారణంగా నెహ్రూ పర్వతారోహణ సంస్థకు చెందిన 28 మంది ట్రైనీలు మంచులో చిక్కుకుని గల్లంతు అయినట్లు సమాచారం అందింది. జిల్లా యంత్రాంగం, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఇండియన్ ఆర్మీ ఐటీబీపీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభించింది అని వెల్లడించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)