Uttarakhand MLA Harish Dhami: ఎమ్మెల్యేకి తప్పిన పెను ప్రమాదం, వరద నీటిలో కొట్టుకుపోయిన ఉత్తరాఖండ్ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే హరీష్‌ ధామీ, స్వల్ప గాయాలతో బయటకు..

వరద ప్రాంతాలను సందర్శిస్తూ అదుపుతప్పి ఏరులో పడిపోయిన ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అనుచరులు సకాలంలో స్పందించడంతో సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్నభారీ వర్షాలకు ఉత్తరాఖండ్‌లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగిన విషయం (flood-affected villages) తెలిసిందే. ఈ క్రమంలో పితోరాఘర్‌ జిల్లాలోని ధార్చులా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న హరీష్‌ ధామి వరద బాధితులను పరామర్శించేందుకు లుమ్తీ గ్రామానికి వెళ్లారు.

Uttarakhand Congress MLA Harish Dhami (Photo-ANI)

Dehradun, July 31: ఉత్తరాఖండ్ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే హరీష్‌ ధామీకి (Uttarakhand Congress MLA Harish Dhami) పెను ప్రమాదం తప్పింది. వరద ప్రాంతాలను సందర్శిస్తూ అదుపుతప్పి ఏరులో పడిపోయిన ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అనుచరులు సకాలంలో స్పందించడంతో సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్నభారీ వర్షాలకు ఉత్తరాఖండ్‌లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగిన విషయం (flood-affected villages) తెలిసిందే. ఈ క్రమంలో పితోరాఘర్‌ జిల్లాలోని ధార్చులా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న హరీష్‌ ధామి వరద బాధితులను పరామర్శించేందుకు లుమ్తీ గ్రామానికి వెళ్లారు. వ్యాక్సిన్ వచ్చే దాకా పోరాడాల్సిందే, దేశంలో 16 లక్షలు దాటిన కరోనా వైరస్ కేసుల సంఖ్య, ఒక్కరోజు 6,42,588 కరోనా పరీక్షలు నిర్వహణ

అక్కడి నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఏరు దాటే క్రమంలో అదుపు తప్పి నీళ్లలో పడిపోయారు. వరద ఉధృతి తీవ్రంగా ఉండటంతో అందులో కొట్టుకుపోయారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అనుచరులు ఆయనను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో స్వల్పగాయాలతో ఎమ్మెల్యే బయటపడ్డారు.

Here's Video

ఈ విషయం గురించి ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన హరీష్‌ ధామి (MLA Harish Dhami) లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కొండప్రాంతాల నుంచి కొట్టుకువస్తున్న చెత్తాచెదారం, వరద నీటితో అవస్థలు పడుతున్నారని చెప్పుకొచ్చారు. నీట మునిగిన ప్రాంతాల ప్రజలను సురక్షితం ప్రాంతాలకు చేర్చేందుకు విమానాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉత్తరాఖండ్‌లో గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.



సంబంధిత వార్తలు

CM Revanth Reddy: రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, అదానీ వ్యవహారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించాలని డిమాండ్

MP Chamala Kiran Kumar Reddy: కేసీఆర్ ఇంట్లో ట్రయాంగిల్ ఫైట్, అరెస్ట్‌తో కేటీఆర్ హీరో కావాలనుకుంటున్నారు...కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్

Realme 14X 5G: రియల్ మి నుంచి తొలిసారిగా ఐపీ69 డస్ట్‌ అండ్‌ వాటర్‌ రెసిస్టెన్స్‌ స్మార్ట్‌ఫోన్, 50 ఎంపీ ట్రిపుల్ కెమెరాతో రియల్‌మీ 14ఎక్స్‌ 5జీ వచ్చేసింది, ధర, పీచర్లు ఇవిగో..

Telangana Assembly Sessions: బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. కౌశిక్ రెడ్డిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆగ్రహం..తీరు మార్చుకోకపోతే సస్పెండ్ చేస్తానని వార్నింగ్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif