Uttarkashi Avalanche: ఉత్త‌ర‌కాశీలో హిమపాతం విషాదం, మరో 7 మృతదేహాలు లభ్యం, 26కు చేరిన మొత్తం మృతుల సంఖ్య, మరో ముగ్గురి కోసం కొనసాగుతున్న ఆపరేషన్

నాలుగు రోజులుగా సాగుతున్న‌ గాలింపు చ‌ర్య‌ల్లో మొత్తం 26 మృత‌దేహాలు ల‌భ్య‌మ‌య్యాయి.

Uttarkashi Avalanche (photo credit- IANS)

ఉత్త‌రాఖండ్ రాష్ట్రం ఉత్త‌ర‌కాశీలో హిమ‌పాతం సంభ‌వించి మంచు దిబ్బ‌ల కింద చిక్కుకున్న ప‌ర్వ‌తారోహ‌కుల కోసం రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగుతున్న‌ది. నాలుగు రోజులుగా సాగుతున్న‌ గాలింపు చ‌ర్య‌ల్లో మొత్తం 26 మృత‌దేహాలు ల‌భ్య‌మ‌య్యాయి. మిగ‌తా ముగ్గురి మృత‌దేహాల‌ కోసం సెర్చింగ్ ఆప‌రేష‌న్‌ కొన‌సాగుత‌న్న‌ది.శుక్ర‌వారం సాయంత్రం నాలుగు గంట‌ల వ‌ర‌కు మ‌రో 7 మృత‌దేహాలను వెలికితీశారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య 26కు చేరింది.

క‌శ్మీర్‌లోని ఓ మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్ష‌ణ పొందుతున్న 29 మంది ట్రెయినీ ప‌ర్వ‌తారోహ‌కులు గ‌త మంగ‌ళ‌వారం ఉత్త‌ర‌కాశీలోని ఓ ప‌ర్వ‌తం బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు. అనంత‌రం ప‌ర్వ‌తాన్ని అధిరోహించ‌డం మొద‌లుపెట్టారు. ఉద‌యం 9 గంట‌ల స‌మ‌యంలో 16 వేల అడుగుల ఎత్తుకు వెళ్లిన త‌ర్వాత ఒక్క‌సారిగా హిమ‌పాతం సంభ‌వించింది.

ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన మంచు కొండచరియలు, 28 మంది పర్వతారోహకులు గల్లంతు, 8 మందిని రక్షించిన ఆర్మీ సిబ్బంది

దాంతో ప‌ర్వ‌తారోహ‌కులంతా ఆ మంచు దిబ్బ‌ల కింద గ‌ల్లంత‌య్యారు. స‌మాచారం అందుకున్న అధికారులు వెంట‌నే రెస్క్యూ టీమ్స్‌ను రంగంలోకి దించి గాలింపు చేప‌ట్టారు. ఆర్మీ, నేష‌న‌ల్ డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్స్‌, ఉత్త‌రాఖండ్ స్టేట్ డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్స్‌, ఇండో టిబెట‌న్ బార్డ‌ర్ పోలీస్ త‌దిత‌ర బృందాలు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన్నాయి.