Vikas Dubey Encounter: వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌, దూబే ఆస్తులపై దిమ్మతిరిగే వాస్తవాలు, ఎన్‌కౌంటర్‌పై పోలీసులు ఏమంటున్నారు, కరడుగట్టిన క్రిమినెల్ మృతి ఎపిసోడ్‌పై కీలక విషయాలు మీకోసం

నిన్న ఉదయం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీలో పోలీసులకు చిక్కిన విషయం విదితమే. అక్కడి నుంచి భారీ భద్రతతో స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కాన్పూర్‌కు తరలిస్తున్నారు. కాన్వాయ్‌లోని ఓ కారు కాన్పూర్‌ సమీపంలో శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఇదే అదనుగా భావించిన దూబే అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో వికాస్ దూబే మృతి (Vikas Dubey Dead) చెందాడు. అతని మృతదేహాన్ని కాన్పూర్‌ దవాఖానకు తరలించారు.

Vikas Dubey Encounter (Photo-ANI)

Kanpur, July 10: కరడుగట్టిన కాన్పూర్ గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ఉత్తరప్రదేశ్‌ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో (UP Police Encounter) హతమయ్యాడు. నిన్న ఉదయం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీలో పోలీసులకు చిక్కిన విషయం విదితమే. అక్కడి నుంచి భారీ భద్రతతో స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కాన్పూర్‌కు తరలిస్తున్నారు. కాన్వాయ్‌లోని ఓ కారు కాన్పూర్‌ సమీపంలో శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఇదే అదనుగా భావించిన దూబే అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో వికాస్ దూబే మృతి (Vikas Dubey Dead) చెందాడు. అతని మృతదేహాన్ని కాన్పూర్‌ దవాఖానకు తరలించారు. ఎట్టకేలకు యూపీ క్రిమినెల్ గార్డుకు చిక్కాడు, గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్ దూబేను ఉజ్జెయినిలో అరెస్ట్ చేసిన పోలీసులు, ఇప్పటికే న‌లుగురు క్రిమిన‌ల్స్‌ ఎన్‌కౌంట‌ర్

కారు బోల్తాపై పోలీసులు మాట్లాడుతూ.. భారీ వర్షం కురుస్తుండటంతోపాటు రోడ్డు సరిగా లేకపోవడంతో కారు ప్రమాదానికి గురై బోల్తా పడిందని ఎస్టీఎఫ్‌ పోలీసులు చెప్పారు. కారు బోల్తా పడగానే వికాస్‌ దూబే పారిపోవడానికి ప్రయత్నించాడని, దీంతో పోలీసులు కాల్పులు జరిపారని (Vikas Dubey Encounter) అక్కడున్న వారు చెబుతున్నారు. ఈ కథలో ఆది నుంచి ఏం జరిగిందనేది ఓ సారి పరిశీలిస్తే..

Vikas Dubey killed in Encounter: 

Gangster Vikas Dubey killed in encounter when he tried to flee after road accident: IG, Kanpur Mohit Agarwal

— Press Trust of India (@PTI_News) July 10, 2020

గ్యాంగ్‌స్టార్‌ వికాస్‌ దూబేను అరెస్టు చేయడానికి డీఎస్పీ దేవేంద్ర మిశ్రా నేతృత్వంలో పోలీసులు కాన్పూర్‌ సమీపంలోని బిక్రూ గ్రామానికి జూన్‌ 3న వెళ్లారు. అరెస్టుకు సంబంధించి అప్పటికే సమాచారం అందడంతో దూబే ముఠా సభ్యులు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో డీఎస్పీ సహా ఎనిమిది మంది పోలీసులు చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దూబే అప్పటి నుంచి తప్పించుకుతిరుగుతున్నాడు. పోలీసులకు చిక్కినట్లే చిక్కి మాయమయ్యాడు. పోలీసులను హతమార్చాక పారిపోయిన దూబే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినికి చేరారు. దూబే ఆచూకీ చెప్పిన వారికి రూ.5లక్షల రివార్డు ఇస్తామని యూపీ సర్కారు ప్రకటించింది.

Here's the statement from SP Kanpur West, Watch Video: 

మధ్య ప్రదేశ్‌లో ఉజ్జ‌యినిలోని మ‌హాకాలేశ్వ‌రుడి ఆల‌యంలో పూజలు నిర్వహిస్తుండగా అక్కడ గార్డు ఇచ్చిన సమాచారంతో ఎంపీ పోలీసులు అతన్ని వలపన్ని పట్టుకున్నారు. అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన వికాస్‌ను ట్రాన్సిట్ రిమాండ్ కింద కాన్పూర్‌కు త‌ర‌లించారు. అయితే వికాస్‌ను త‌ర‌లిస్తున్న వాహ‌నం కాన్పూర్‌కు 17 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న బాక్రా అనే గ్రామం వ‌ద్ద ప‌ల్టీ కొట్టింది. ఆ స‌మ‌యంలో త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేసిన వికాస్‌ను పోలీసులు కాల్చి చంపారు. ఇవాళ ఉద‌యం 6.15 నుంచి 6.30 నిమిషాల మ‌ధ్య ఎన్‌కౌంట‌ర్ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. నేనే వికాస్ దూబే.. కాన్పూర్‌వాలా అంటూ నిన్న అరిచిన ఆ గ్యాంగ్‌స్ట‌ర్ త‌న స్వంత ప‌ట్ట‌ణానికి స‌మీపంలోనే ఎన్‌కౌంట‌ర్ అయ్యాడు. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు ఎస్‌టీఎఫ్ పోలీసుల‌కు కూడా గాయాల‌య్యాయి. ఎన్‌కౌంట‌ర్ జ‌రిగిన స‌మ‌యంలో వికాస్ నిన్న వేసుకున్న దుస్తుల్లోనే ఉన్నారు.

One of the Vehicles of Convoy of UP Special Task Force Bringing Back Notorious Gangster From MP to Kanpur Overturns:

Kanpur: One of the vehicles of the convoy of Uttar Pradesh Special Task Force (STF) that was bringing back #VikasDubey from Madhya Pradesh to Kanpur overturns. Police at the spot. More details awaited. pic.twitter.com/ui58XBbd82

— ANI UP (@ANINewsUP) July 10, 2020

కాగా వికాస్‌ దూబేను తీసుకువెళ్తున్న వాహ‌నంలో ఇద్ద‌రు కానిస్టేబుళ్లు ఉన్నారు. అయితే ఆ కానిస్టేబుళ్ల నుంచి పిస్తోల్ లాక్కునే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆ ద‌శ‌లోనే జ‌రిగిన కాల్పుల్లో వికాస్‌కు రెండు బుల్లెట్లు దిగాయి. మొదటి బుల్లెట్ న‌డుములో దిగింది. ఇక రెండ‌వ బుల్లెట్‌ను ఛాతిలో కాల్చారు. ఆ వెంట‌నే పోలీసులు వికాస్‌ను హాస్పిట‌ల్‌కు తీసుకువెళ్లారు. అయితే ఉద‌యం 7.55 నిమిషాల‌కు వికాస్ మ‌ర‌ణించిన‌ట్లు ప్ర‌క‌టించారు. వికాస్ దూబే ఆచూకి తెలిపితే రూ. 5 లక్షల రివార్డు, ఢిల్లీ కోర్టులో లొంగిపోయేందుకు దూబే ప్రయత్నాలు

కాన్పూర్ ఎన్ కౌంటర్ పై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో 81 మంది పేర్లున్నాయి. దూబేతో సంబంధాలున్న 68 మంది పోలీసులను సస్పెండ్, బదిలీలు చేశారు. గత వారం రోజుల్లో యూపీ పోలీసులు దూబే అనుచరులు ఐదుగురిని ఎన్‌కౌంటర్లలో కాల్చిచంపారు. వికాస్ దూబే భార్య, కుమారుడితోపాటు మొత్తం 11 మంది అతని బంధువులను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ క్రిమిన‌ల్‌కు సంబంధించిన కొన్ని విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. వికాస్ దూబే ఇంట‌ర్ చ‌దువుతున్న స‌మ‌యంలో అత‌ను కాలేజీకి త‌పంచా ప‌ట్టుకుని వెళ్లేవాడని, త‌న ద‌గ్గ‌ర ఉన్న నాటు తుపాకీతో తోటి విద్యార్థుల‌ను, టీచ‌ర్ల‌ను బెదిరించేవాడని తెలుస్తోంది. 14 ఏళ్ల వ‌య‌సులోనే వికాస్‌.. టీచ‌ర్ల‌పై దాడి చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. చిన్న‌త‌నం నుంచే వికాస్.. క్రిమిన‌ల్ మైండ్‌సెట్‌తో పెరిగిన‌ట్లు అత‌నితో చ‌దువుకున్న‌వారు చెప్పారు.

ఇంట‌ర్ అయ్యాక ర‌సూలాబాద్‌లో అత‌ను ఓ రేడియో షాపును ఓపెన్ చేశాడు. రేడియో రిపేర్లు చేసేవాడు. పాకెట్ మనీ కోసం ఆ షాపును నాలుగేళ్లు న‌డిపాడు. అయితే అత‌ని ప్ర‌వ‌ర్త‌న‌పై అనుమానం రావ‌డంతో.. మామ ప్రేమ్‌కిషోర్ అత‌న్ని ఇళ్లు వ‌దిలి వెళ్ల‌మ‌న్నాడు. అప్పుడు అత‌ను బికారూ గ్రామానికి వ‌చ్చి సెటిల‌య్యాడు. ఆ త‌ర్వాత వికాస్ పూర్తి స్థాయి క్రిమిన‌ల్‌గా మారాడు. మంత్రి సంతోష్ శుక్లా మ‌ర్డ‌ర్ కేసులో అత‌ను నిందితుడిగా ఉన్నాడు. కానీ ఆధారాలు లేక‌పోవ‌డంతో కోర్టు అత‌న్ని నిర్దోషిగా ప్ర‌క‌టించింది.

వికాస్ దూబేపై సుమారు 60 కేసులు ఉన్న‌ట్లు యూపీ పోలీసులు చెప్పారు. ఇదిలా ఉంటే వికాస్ ఎన్‌కౌంట‌ర్‌పై విప‌క్షాలు ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి. పోలీసుల్ని ర‌క్షించేందుకే వికాస్‌ను ఎన్‌కౌంట‌ర్ చేశార‌ని ప్రతిపక్ష నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు.

గ్యాంగ్‌స్ట‌ర్ దూబే తక్కువ కాలంలోనే కోట్లాదిరూపాయల ఆస్తులు సంపాదించాడని ఆదాయపు పన్నుశాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో తక్కువ కాలంలో దూబే ఎలా కోట్లు గడించాడు అన్న దానిపై ఐటీ శాఖ అధికారులు దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. ఉజ్జయినిలో దూబేను అరెస్టు చేయగానే, అతనితోపాటు అతని బంధువుల పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. వికాస్ దూబే సన్నిహితుల‌ పేరిట దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తోపాటు పలు దేశాల్లో ఆస్తులున్నాయని వెల్లడైంది.

దూబే ఎనిమిది నెలల క్రితం లక్నోలో రూ.5 కోట్లు వెచ్చించి ఓ భవనం కొన్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతోపాటు బ్యాంకాక్‌లోని ఓ హోటల్‌లో వికాస్ దూబే పెట్టుబడి పెట్టిన‌ట్లు వార్తలు వస్తున్నాయి. వికాస్ దూబేకు 12 ఇండ్లు, 21 ఫ్లాట్లు ఉన్నాయని పోలీసులు ఇప్ప‌టికే గుర్తించారు. దూబే సన్నిహితడి పేరిట ఆర్యనగర్ లో 28 కోట్ల ఆస్తులు, ఆర్యనగర్‌లోనే దూబే మ‌రో సన్నిహితుడి పేరిట 8 ఫ్లాట్లు ఉన్నాయని, వీటి విలువ రూ.5 కోట్లు ఉంటుందని పోలీసులు తేల్చారు.

కాన్పూర్ నగరంలోని పంకీ ప్రాంతంలో దూబేకు డూప్లెక్స్ బంగళా ఉంది. దీని విలువ రూ.2 కోట్లు ఉంటుంద‌ని పోలీసులు చెప్పారు. ఐటీ అధికారులు దూబేతోపాటు అతని బంధువులు, సన్నిహిత అనుచరుల పేరిట ఉన్న ఆస్తుల గురించి కూడా సమగ్ర దర్యాప్తు జ‌రుపుతున్నారు.