Vikas Dubey Arrested: ఎట్టకేలకు యూపీ క్రిమినెల్ గార్డుకు చిక్కాడు, గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను ఉజ్జెయినిలో అరెస్ట్ చేసిన పోలీసులు, ఇప్పటికే నలుగురు క్రిమినల్స్ ఎన్‌కౌంటర్
ఉత్తరప్రదేశ్‌కు (Uttar Pradesh) చెందిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే (Vikas Dubey) తలపై 5 లక్షల రివార్డు ఉన్న విషయం విదితమే. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయినిలో (MP Ujjain) వికాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఉజ్జెయినిలో మహాకాళేశ్వరుడికి పూజలు నిర్వహించేందుకు వికాస్ అక్కడకు వెళ్లగా పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు.కాగా మహాకాళేశ్వరుడి ఆలయంలో పనిచేస్తున్న ఓ గార్డు అతన్ని నిర్బంధించి ఉజ్జెయిన్ ఎస్పీ మనోజ్ సింగ్‌కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
New Delhi, July 9: యూపీ మోస్ట్ వాంటెడ్ క్రిమినెల్ వికాశ్ దూబే ఎట్టకేలకు అరెస్టు (Vikas Dubey Arrested) అయ్యాడు. ఉత్తరప్రదేశ్‌కు (Uttar Pradesh) చెందిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే (Vikas Dubey) తలపై 5 లక్షల రివార్డు ఉన్న విషయం విదితమే. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయినిలో (MP Ujjain) వికాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఉజ్జెయినిలో మహాకాళేశ్వరుడికి పూజలు నిర్వహించేందుకు వికాస్ అక్కడకు వెళ్లగా పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు.కాగా మహాకాళేశ్వరుడి ఆలయంలో పనిచేస్తున్న ఓ గార్డు అతన్ని నిర్బంధించి ఉజ్జెయిన్ ఎస్పీ మనోజ్ సింగ్‌కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. వికాస్ దూబే ఆచూకి తెలిపితే రూ. 5 లక్షల రివార్డు, ఢిల్లీ కోర్టులో లొంగిపోయేందుకు దూబే ప్రయత్నాలు
గత వారం కాన్పూర్‌లో బిక్రూ గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో (Kanpur Encounter) 8 మంది పోలీసులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ కేసులో వికాస్ ప్రధాన నిందితుడు. వికాస్ కోసం గత అయిదు రోజుల నుంచి యూపీ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుతో లింకు ఉన్న నలుగురు క్రిమినల్స్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. కాన్పూర్‌లోని తన స్వంత ఇంటి నుంచి తప్పించుకున్న వికాస్ ఆ తర్వాత పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు.
Visuals of Vikas Dubey After Arrest
యూపీ నుంచి పరారైన వికాస్.. హర్యానా, నోయిడాలో పోలీసుల కన్నుగప్పి తప్పించుకుని తిరిగాడు. అతని కోసం 40 బృందాలుగా పోలీసులు విస్తృతంగా అన్వేషణ చేపట్టారు. ఇవాళ ఉదయం ఉజ్జయినిలోని మహాకాల్ మందిరంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా ఈ విషయాన్ని ద్రువీకరించారు.
కాగా కరడుకట్టిన కాన్పూర్ గ్యాంగస్టర్ వికాస్ దూబేను ఎన్‌కౌంటర్ భయం వెంటాడినట్లు తెలుస్తోంది. దూబే కోర్టులో, లేదా టీవీ స్టూడియోలో లొంగిపోయేందుకు ప్రయత్నించగా కోర్టు కాంప్లెక్సుల్లో, టీవీ స్టూడియోల వద్ద పోలీసులను మోహరించడంతో ఎన్‌కౌంటర్ చేస్తారనే భయంతో అతను వెనుకంజ వేశాడని సమాచారం. దూబే ప్రధాన అనుచరులు ముగ్గురు పోలీసుల కాల్పుల్లో మరణించారు. రెండు రోజుల క్రితం ఫరీదాబాద్ హోటల్ లో ఉన్న దూబే అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు యూపీలో అరెస్ట్ అయ్యారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని పోలీసులు వికాస్ దూబేను ట్రాన్సిట్ రిమాండుపై కోర్టు అనుమతితో ఉత్తరప్రదేశ్ పోలీసులకు అప్పగించనున్నారని సమాచారం. మొత్తం 60 కేసుల్లో వికాస్ దూబే నిందితుడు. ఎమ్మెల్యే కావాలనుకున్న దూబే జిల్లా పంచాయతీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. బీజేపీ మంత్రి సంతోష్ శుక్లాను హతమార్చిన కేసులో దూబే ప్రధాన నిందితుడు.