IPL Auction 2025 Live

Jharkhand Shocker: ఇంత దారుణమా, సగం గుండు కొట్టించి, చెప్పుల దండలు వేయించి గంటల పాటు బురదలో.., దొంగతనం చేశారంటూ ఇద్దరి పిల్లలపై అమానవీయం

దొంగతనం చేసి దొరికిపోయిన ఇద్దరు యువకులను స్థానికలు పట్టుకుని శిరోముండనం చేశారు. అనంతరం ఇద్దరి మెడలో చెప్పుల దండలు వేసి.. ఓ బురద గుంటలో గంటల పాటు నిల్చోబెట్టారు.

Representational Image (Photo Credits: Pexels)

Ranchi, July 3: జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేసి దొరికిపోయిన ఇద్దరు యువకులను స్థానికలు పట్టుకుని శిరోముండనం చేశారు. అనంతరం ఇద్దరి మెడలో చెప్పుల దండలు వేసి.. ఓ బురద గుంటలో గంటల పాటు నిల్చోబెట్టారు. ఈ అమానవీయ ఘటన రాజ్‌మహల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.

ఘటన వివరాల్లోకెళితే.. ఇద్దరు యువకులు ఓ మహిళ ఇంట్లో రూ.4300 దొంగతనం చేశారు. ఇందులో ఓ బాలుడు దొరికిపోయాడు. అతన్ని పట్టుకున్న స్థానికులు మరో బాలున్ని ఇంట్లో నుంచి లాక్కొచ్చారు. ఊర్లో అందరి సమక్షంలోనే సగం గుండు కొట్టించారు. అనంతరం చెప్పుల దండలు మెడలో వేసి, ఊరేగించారు. ఈ ఘటనను కొందరు యువకులు వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇవి కాస్త వైరల్‌గా మారాయి.

యువతీయువకుడి మధ్య వాగ్వాదం, అబ్బాయి చెంప ఛెళ్లుమనిపించిన యువతి.. ఢిల్లీ మెట్రోలో మరో షాకింగ్ సన్నివేశం.. నెట్టింట వీడియో వైరల్

ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. బాధితుల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేశారు. పిల్లలను ఆరు గంటల పాటు బురదలోనే నిల్చొబెట్టారని బాధితుల తల్లిదండ్రులు ఆరోపించారు. రూ.3000 విధించిన జరిమానా చెల్లించిన తర్వాతనే పిల్లలను వదిలిపెట్టారని పోలీసులకు చెప్పారు. దర్యాప్తు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు. దోషులపై కఠిన శిక్షలు విధిస్తామని వెల్లడించారు.



సంబంధిత వార్తలు

Company Fires Employee For Sleeping At Work: పనిచేసే సమయంలో నిద్రపోయాడని ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీ.. కోర్టుకెక్కి రూ.41.6 లక్షల పరిహారం పొందిన ఉద్యోగి

Kissik Lyrical Video Song Is Out Now: వామ్మో ఇంత కిర్రాక్ మాస్ బీట్ సాంగా? శ్రీ‌లీల స్టెప్స్ కు య్యూట్యూబ్ ద‌ద్ద‌రిల్లిపోతోంది. పుష్ప -2 నుంచి కిస్సిక్ సాంగ్ వ‌చ్చేసింది, చూసేయండి!

Rishabh Pant: రూ. 27 కోట్లతో ఐపీఎల్ వేలం రికార్డులన్నీ బద్దలు కొట్టిన రిషబ్ పంత్, IPL చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన భారత స్టార్ వికెట్ కీపర్

Jharkhand Election Result 2024: జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, నాలుగో సారి సీఎం కాబోతున్న హేమంత్‌ సొరేన్‌, 56 స్థానాల్లో జేఎంఎం కూటమి విజయభేరి, 26 స్థానాలతో సరిపెట్టుకున్న ఎన్డీఏ కూటమి