Visa-Free Entry in 16 Countries: గుడ్ న్యూస్, 16 దేశాలకు వీసా లేకుండా ప్రయాణం చేయవచ్చు, రాజ్యసభలో వెల్లడించిన విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్

16 దేశాల్లో వీసా లేకుండా ప్రయాణం (Visa-Free Entry in 16 Countries) చేయవచ్చని తెలిపింది. నేపాల్, భూటాన్, మారిషస్ సహా పదహారు దేశాలు భారత పాస్ పోర్టు హోల్డర్లకు వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తున్నాయని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ (V Muraleedharan) మాట్లాడుతూ 43 దేశాలు వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయని, భారతీయ సాధారణ పాస్ పోర్ట్ హోల్డర్లకు ఈ-వీసా సౌకర్యం 36 దేశాలున్నాయని కల్పిస్తున్నాయని తెలిపారు.

Union Minister V Muraleedharan (Photo Credits: ANI)

New Delhi, September 22: విదేశాలకు టూర్ కి వెళ్లాలనుకునేవారికి కేంద్రం శుభవార్తను చెప్పింది. 16 దేశాల్లో వీసా లేకుండా ప్రయాణం (Visa-Free Entry in 16 Countries) చేయవచ్చని తెలిపింది. నేపాల్, భూటాన్, మారిషస్ సహా పదహారు దేశాలు భారత పాస్ పోర్టు హోల్డర్లకు వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తున్నాయని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ (V Muraleedharan) మాట్లాడుతూ 43 దేశాలు వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయని, భారతీయ సాధారణ పాస్ పోర్ట్ హోల్డర్లకు ఈ-వీసా సౌకర్యం 36 దేశాలున్నాయని కల్పిస్తున్నాయని తెలిపారు.

మురళీధరన్ రాజ్యసభలో మాట్లాడుతూ.. భారతీయ సాధారణ పాస్ పోర్ట్ హోల్డర్లకు వీసా రహిత ప్రవేశం (Visa-Free Entry) కల్పించే 16 దేశాలున్నాయని మంత్రి తెలిపారు. బార్బడోస్, భూటాన్, డొమినికా, గ్రెనడా, హైతీ, హాంగ్‌కాంగ్‌, మాల్దీవులు, మారిషస్, మాంట్సెరాట్, నేపాల్, నియుద్వీపం, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్, సమోవా, సెనెగల్, సెర్బియా, ట్రినిడాడ్ టొబాగో వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే వీసా ఆన్-అరైవల్ సదుపాయాన్ని కల్పిస్తున్న 43 దేశాల్లో ఇరాన్, ఇండోనేషియా, మయన్మార్ ఉన్నాయని చెప్పారు.

సెప్టెంబర్ 25న భారత్ బంద్, కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలని పిలుపునిచ్చిన రైతు సంఘాలు

శ్రీలంక, న్యూజిలాండ్, మలేషియా దేశాలు 36 దేశాల్లో భారత సాధారణ పాస్ పోర్టు హోల్డర్లకు ఈ-వీసా సౌకర్యం కల్పిస్తున్నాయని మంత్రి తెలిపారు. భారతీయులకు అంతర్జాతీయ ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు వీలుగా వీసా రహిత ప్రయాణం, వీసా ఆన్-అరైవల్, ఈ-వీసా సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సౌకర్యం కల్పించే దేశాల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని మురళీధరన్ తెలిపారు.