Gujarat Assembly Elections 2022 Phase 1 Polling: గుజరాత్‌లో కొనసాగుతున్న తొలి విడత పోలింగ్, మార్పుకోసం ఓటువేయాలంటూ కేజ్రీవాల్ ట్వీట్, యువత భారీగా ఓటింగ్‌ లో పాల్గొనాలంటూ ప్రధాని మోదీ ట్వీట్

అయితే, 1995 నుంచి గుజరాత్ లో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకొనేందుకు పట్టుదలతో ఉంది. కానీ, 2002 నుంచి ఆ పార్టీకి అసెంబ్లీ స్థానాల సంఖ్య తగ్గుతూ వస్తోంది.

Representational image (Photo Credit- ANI)

Ahmadabad, DEC 01: గుజరాత్ లో మొదటి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Gujarat Election) కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు ఈసీ ఎన్నికల షెడ్యూల్‌‌ను ప్రకటించగా.. తొలివిడతలో (Phase-1) 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దక్షిణ గుజరాత్లోని 19 జిల్లాలు, కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లోని 89 స్థానాల్లో పోలింగ్ (polling) కొనసాగుతుండగా.. 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందుకోసం మొత్తం 14,382 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 23,976,670 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రెండవ దశ ఎన్నిక 93 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 5న జరుగుతుంది. ఈ ఎన్నికల ఫలితాలను హిమాచల్ ప్రదేశ్‌ (Himachal pardesh) రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలతో కలిపి డిసెంబర్ 8న వెల్లడిస్తారు.

ఈ ఎన్నికల్లో ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు ప్రధాని మోదీ (PM Modi). తొలిసారి ఓటు హక్కు వచ్చిన యువత...ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేయాలని సూచించారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా(amit shah) కూడా గుజరాత్‌ లో డెవలప్‌ మెంట్ కోసం ఓటు వేయాలంటూ ప్రజల్ని కోరుతూ ట్వీట్ చేశారు. మరోవైపు గుజరాత్‌ లో మార్పుకోసం ప్రజలు ఓటు వేయాలంటూ ఓటర్లను కోరారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal).

ఇదిలాఉంటే.. మొదటి విడత పోలింగ్ జరిగే అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ అభ్యర్థులు, పార్టీల అగ్రనేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. అయితే, 1995 నుంచి గుజరాత్ లో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకొనేందుకు పట్టుదలతో ఉంది. కానీ, 2002 నుంచి ఆ పార్టీకి అసెంబ్లీ స్థానాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2018 ఎన్నికల్లో 137 అసెంబ్లీ స్థానాల నుంచి 99 స్థానాలకు బీజేపీ పడిపోయింది. ఈ దఫా ఎన్నికల్లో రాష్ట్రంలో 182 అసెంబ్లీ సీట్లలో 140 సీట్లను లక్ష్యంగా చేసుకొని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్రనేతలు విస్తృత ప్రచారం నిర్వహించారు.

Fact Check: కేంద్రం యువకులకి రూ. 3 వేలు ఇస్తోందంటూ వార్త వైరల్, నమ్మవద్దని హెచ్చరించిన పిఐబి బృందం, వెబ్‌సైట్/లింక్‌లో షేర్ చేయవద్దని హెచ్చరిక 

మరోవైపు కాంగ్రెస్, ఆప్ పార్టీలు ఈసారి అధికారంలోకి వస్తామని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. 2017 ఎన్నికల సమయంలో ఈ 89 స్థానాల్లో బీజేపీ 49.3% ఓట్లతో 48 అసెంబ్లీ సీట్లను, కాంగ్రెస్ 41.7% ఓట్లతో 38 సీట్లను గెలుచుకుంది. ఇక్కడ 2012 నుండి కాంగ్రెస్‌కు 16 స్థానాలను నికరంగా కైవసం చేసుకుంది.ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు కూడా బరిలో నిలిచారు.



సంబంధిత వార్తలు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..

One Nation-One Election: పార్లమెంటుకు జమిలి బిల్లు నేడే.. లోక్‌ సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రం.. పూర్తి వివరాలు ఇవిగో..!

Telangana Assembly Session 2024: తెలంగాణకు వెళితే చికున్ గున్యా వస్తుంది, అమెరికాలో చెప్పుకుంటున్నారంటూ హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు వీడియో ఇదిగో..