Mumbai Airport: 2 వేల పోస్టులు వచ్చింది 25 వేల మంది...తొక్కిసలాట, చేతులెత్తేసిన ఎయిర్ పోర్టు సిబ్బంది
ఏ చిన్న పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానించిన వేలు, లక్షల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నారు.మహారాష్ట్రలోని ముంబై కలినా ఎయిర్ పోర్టులో మెకానిక్ ఉద్యోగాలకు ఇటీవలె నోటిఫికేషన్ విఉడదలైంది.
Mumbai,July 16: దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఏ చిన్న పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానించిన వేలు, లక్షల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నారు.మహారాష్ట్రలోని ముంబై కలినా ఎయిర్ పోర్టులో మెకానిక్ ఉద్యోగాలకు ఇటీవలె నోటిఫికేషన్ విఉడదలైంది.
2,216 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.అంతే ఎవరూ ఊహించని విధంగా నిరుద్యోగులు పోటెత్తారు. దీంతో నిరుద్యోగులను చూసి ఎయిర్ పోర్ట్ సిబ్బంది షాక్‌కు గురయ్యారు.
ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన రావడం, అభ్యర్థుల మధ్య తోపులాట జరగడంతో స్వల్ప ఉద్రిక్తత కూడా చోటు చేసుకుంది. దీంతో నియామక ప్రక్రియ కొనసాగించలేని నిర్వాహకులు వారి బయోడేటాను ఇచ్చి వెళ్లాలని, ఆ తర్వాత తమ కార్యాలయం నుండి ఫోన్ చేస్తామని తెలిపారు.సిటీ బస్సులో కండక్టర్ తనపట్ల అనుచితంగా ప్రవర్తించాడని హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి ఎక్స్ వేదికగా వాపోయింది. మణికొండ నుంచి హిమాయత్ నగర్ వెళ్తున్న బస్సులో కండక్టర్ తనను అసభ్యంగా తాకినట్లు ఆవేదన వ్యక్తం చేసింది.తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాక పుట్టిన సంగతి తెలిసిందే. త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్, అదేవిధంగా హరీష్ రావు బీజేపీలో చేరితే స్వాగతిస్తామని బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు.
అయితే ఉద్యోగాల కోసం భారీ ఆశతో వచ్చిన అభ్యర్థులు ఎయిర్ పోర్టు నుండి వెళ్లేందుకు నిరాకరించడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 25వేలమందికి పైగా యువకులు తరలిరావడంతో తొక్కిసలాట కూడా జరిగింది. నిర్వాహకుల తీరుపై నిరుద్యోగులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గంటల తరబడి వెయిట్ చేయించారని కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా ఏర్పాటు చేయలేదని ఆరోపించారు.