Wayanad Landslide Death Toll: శవాల దిబ్బగా మారిన దేవుని సొంత దేశం, వయనాడ్ విలయంలో 158కి పెరిగిన మృతుల సంఖ్య, ఇంకా కానరాని 98 మంది జాడ
రెస్క్యూ ఆపరేషన్‌లో మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
Kozhikode, July 31: దేవుని స్వంత దేశంగా ప్రసిద్ధికెక్కిన కేరళలోని వయనాడ్‌లో సంభవించిన అత్యంత విషాదకరమైన కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రెస్క్యూ ఆపరేషన్‌లో మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటివరకు మృతుల సంఖ్య 158కి (Wayanad Landslide Death Toll) చేరుకుంది.మరో 98 మంది (98 Missing in Devastating Landslide) జాడ కోసం వెతుకుతున్నారు. ఇక గాయపడిన 130 మంది వయనాడ్‌లోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారి కోసం భారీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి.
వయనాడ్‌లో కుండపోత వర్షాల కారణంగా భారీగా కొండచరియలు (Wayanad Landslide) విరిగిపడ్డాయి.కొండచరియలు విరిగిపడిన ప్రదేశంలో భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ భారీ వర్షాలు, వరదలతో చలియార్ నదికి వరద పోటెత్తింది. ఈ వరదలో ప్రజలు సైతం కొట్టుకు పోయినట్లు సమాచారం. జిల్లాలోని ముండక్కై, చూర్లమాట, అట్టమాలతోపాటు నూల్పూజా ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కేరళ విలయానికి కారణమిదేనా?, కొనసాగుతున్న సహాయక చర్యలు, వందలాది మంది శిథిలాల కిందే,పొంచి ఉన్న భారీ వర్షం ముప్పు!
భారీ వంతెనలు సైతం నీటిలో కొట్టుకు పోయాయి. దీంతో ఆర్మీ సహాయక చర్యల్లో భాగంగా తాత్కాలిక వంతెనలను నిర్మించింది. తద్వారా వేలాది మంది ప్రజలును సురక్షిత ప్రాంతాలకు తరలించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ముందంటూ గత పక్షం రోజులుగా కేరళ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తునే ఉన్నామని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మొత్తం 225 ఆర్మీ సిబ్బంది ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారని వివరించారు. అందులో వైద్య బృందాలు సైతం ఉన్నాయన్నారు. ఈ సహాయక చర్యల్లో భాగంగా రెండు ఎయిర్ ఫోర్స్ హెలికాఫ్టర్లు, ఎంఐ 17, అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాఫ్టర్‌ను వినియోగిస్తున్నట్లు చెప్పారు.
Here's Pics and Videos
అక్కడ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి బాధ వర్ణనాతీతంగా ఉంది. అటు ఇటు తిరుగుతూ తమ వారి కోసం వారు పిలుస్తున్న పిలుపులు చూసినవారిని కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇక ఇళ్లలో చిక్కుకున్న కొందరు తమను కాపాడాలంటూ ఆ ఇళ్లలోంచి ఫోన్లు చేస్తున్నారు. ముండక్కై, చూరల్‌మల, అట్టామల, నూల్‌పుజా గ్రామాలలో ఈ తరహా దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాగా మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మొదటిసారి కొండచరియలు విరిగిపడగా.. 4.10 గంటలకు మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో గ్రామాలకు గ్రామాలు శిథిలాల కింద సమాధి అయ్యాయి.పరిస్థితి తీవ్రత దృష్ట్యా మంగళవారం, బుధవారం రెండ్రోజుల పాటు సంతాప దినాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వయనాడ్‌లో ఆగని మృత్యుఘోష, 123కి చేరిన మృతుల సంఖ్య, 128 మందికి తీవ్ర గాయాలు, ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
కేరళలో ప్రకృతి కారణంగా సంభవించిన భారీ విపత్తుపై ప్రధాని మోదీ ఇప్పటికే స్పందించారు. రాష్ట్రాన్ని అన్ని విధాల ఆదుకుంటామని ఆయన కేరళ సీఎం పినరయి విజయన్ కు హామీ ఇచ్చారు. అలాగే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం కేరళకు ఆపన్న హస్తం అందించేందుకు ముందుకు వచ్చాయి. అయితే ఈ విపత్తు నేపథ్యంలో రాష్ట్రంలో రెండు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రభుత్వం ప్రకటించింది. అలాగే వివిధ కార్యక్రమాలను సైతం నిషేధించినట్లు కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది.
వయనాడ్‌లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల పర్యటన వాయిదా పడింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల..ఈ పర్యటన వాయిదా పడింది. అయితే సాధ్యమైనంత త్వరలో వయనాడ్‌లో పర్యటిస్తామని రాహుల్ గాంధీ.. తన ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. ఇక ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో వయనాడు నుంచి రాహుల్ గాంధీ గెలుపొందారు. ఆయన రాయబరేలి నుంచి కూడా విజయం సాధించారు. దీంతో వయనాడ్ ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేశారు. మరికొద్ది రోజుల్లో ఈ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తుంది.