Wayanad landslides updates Death toll rises to 143,reason for kerala landslides

Kerala, July 31: దేవుని సొంత దేశంగా పేర్కొనే కేరళ రాష్ట్రం ప్రకృతి ప్రకోపానికి చిన్నా,భిన్నమైంది. కొద్ది రోజులుగా కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాలకు తోడు కొండ చరియలు విరిగి పడటంతో కేరళలోని వాయనాడ్ అతలాకుతలమైంది. ఓ వైపు కొండచిరయలు, మరోవైపు బురద నీరు వెరసి వందలాది మంది వాటి కింద సజీవ సమాధి అయ్యారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పటివరకు 143 మంది చనిపోయినట్లు కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించింది. గాయపడిన వారికి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. సైనిక సహాయక చర్యలతో పాటు ఎన్డీఆర్ సిబ్బంది రెస్య్కూని కొనసాగిస్తున్నాయి.

మట్టిలో కూరుకుపోయిన వారి ఆచూకీ కోసం సైన్యానికి చెందిన శునకాలను వినియోగిస్తున్నారు. ఇక సహాయక చర్యలు కొనసాగుతుండగానే మరోవైపు పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కే మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కాసరోగోడ్, కన్నూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఇక ఇవాళ ప్రతిపక్ష నేత, వాయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకా వాద్రాలు కొండ చరియలు విరిగి పడిన ప్రాంతాల్లో పర్యటించనున్నారు. వయనాడ్ ప్రకృతి ప్రకోపానికి ఉష్ణోగ్రతల పెరుగుదల, వాతావరణ మార్పులు కారణమని అవే కొండచరియలు విరిగిపడే అవకాశాలను మరింత పెంచుతున్నాయని నిపుణులు వెల్లడించారు. దీనికి తోడు కేరళలో ఈ విషాదానికి ప్రధాన కారణం అరేబియా సముద్రం వేడెక్కడమేనని అంచనా వేస్తున్నారు.

స్వల్ప కాలంలోనే దట్టమైన మేఘాలు ఏర్పడటం, అతిభారీ వర్షాలకు కారణమయ్యిందని తెలిపారు. గత 24 గంటల్లో కేరళలోని పలు జిల్లాల్లో 10 సెం.మీ వర్షపాతం నమోదు అయిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీనికి తోడు రెండు వారాలుగా ఎడతెరపిలేని వర్షం, నేల తేమగా మారడం, అరేబియా సముద్రంలో వేడిగాలు కారణంగా దట్టమైన మేఘాల వ్యవస్థ ఏర్పడటంతో కొండచరియలు విరిగి పడ్డాయని చెబుతున్నారు. 2019లో కేరళలో వరదలకు కారణమైన దట్టమైన మేఘాల మాదిరిగానే ఇవి ఉన్నాయని వెల్లడిస్తున్నారు నిపుణులు.

వయనాడ్‌లో మొబైల్ ఫోన్ నెట్ వర్క్ దెబ్బతినడం సహాయక చర్యలకు మరింత సమస్యగా మార్చింది. తేయాకు, కాపీ, యాలకుల తోటల్లో పనిచేసే వందాలది మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. వయనాడ్‌‌లో ఆగని మృత్యుఘోష, 123కి చేరిన మృతుల సంఖ్య, 128 మందికి తీవ్ర గాయాలు, ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Here's Tweet:

Death toll climbs to 143 in Wayanad landslide tragedy, rescue operation underway