Weather Forecast: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం, ఏపీలో ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ఐఎండీ, తెలంగాణలో చంపేస్తున్న చలిపులి
బంగాళాఖాతంలో ఈ వారంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Hyd, Dec 5: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఈ వారంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఐఎండీ ప్రకారం.. అల్లూరి సీతారామరాజు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, అన్నమయ్య జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అలాగే విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
తెలంగాణలో చూస్తే నాలుగైదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. డిసెంబర్ 11వ తేదీ వరకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వానలు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇక రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. వచ్చే వారంలో రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని పేర్కొంది.
ఫెంగల్ ఆవర్తనంపై రేపు ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఫెంగల్ తుఫాను బలహీనపడి అల్పపడీనంగా మారి అరేబియా సముద్రంలోకి ప్రవేశించింది. ఇక శుక్రవారం బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం శ్రీలంక దిశగా పయనిస్తుందని ఐఎండీ అంచనా వేసింది. ఇదిలా ఉంటే ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ శాఖ ల విభాగాధిపతులతో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకోవల్సిన చర్యలపై వారికి సూచనలు జారీచేశారు.
విపత్తు సమయాల్లో ప్రాణ,ఆస్తి నష్ట నివారణ చర్యలతో పాటు సహాయక చర్యలు చేపట్టేందుకు అవసరమైన అత్యాధునిక శిక్షణ వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. విధ్వంసం సృష్టించే వాయుగుండం సమయంలో అంచనా కోసం అవసరమైన పరికరాల మరమ్మతులు సహా కొత్త టెక్నాలజీ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుని విపత్తునిర్వహణ శాఖను పటిష్టంగా మారుస్తామన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత.