West Bengal: గంగా నది పవిత్ర జలం కోసం వెళ్తుండగా ఘోర ప్రమాదం, 10 మంది శివుని భక్తులు మృతి, డీజే జనరేటర్ తీగలకు ఎర్త్ రావడంతో విషాద ఘటన

కన్వర్ యాత్రికులతో జల్పేష్ వెళ్తున్న ట్రక్కులో విద్యుదాఘాతం కారణంగా 10 మంది ప్రాణాలు( 10 dead, many injured ) కోల్పోయారు. మరో 19 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, తీవ్రంగా గాయపడిన 16 మందిని మరింత మెరుగైన చికిత్స కోసం జల్పాయ్‌గురి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

10 dead many injured due to electrocution in Cooch Behar (Phoot-ANI)

Cooch Behar, August1: పశ్చిమ బెంగాల్ కూచ్‍బిహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కన్వర్ యాత్రికులతో జల్పేష్ వెళ్తున్న ట్రక్కులో విద్యుదాఘాతం కారణంగా 10 మంది ప్రాణాలు( 10 dead, many injured ) కోల్పోయారు. మరో 19 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, తీవ్రంగా గాయపడిన 16 మందిని మరింత మెరుగైన చికిత్స కోసం జల్పాయ్‌గురి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పదిమంది మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. వాహనంలోని డీజే సిస్టం కోసం ఏర్పాటు చేసిన జనరేటర్ వైరింగ్ కారణంగానే విద్యుదాఘాతం (electrocution in Cooch Behar) సంభవించినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.

వ్యాను జల్పేష్ వెళ్తుండగా ఆదివారం అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వ్యానులో మొత్తం 29 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరందరినీ స్థానిక ఆస్పత్రికి తరలించగా.. పది మంది అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని పేర్కొన్నారు. వ్యాను వెనకాల ఏర్పాటు చేసిన డీజే జనరేటర్ తీగలతోనే విద్యుదాఘాతం సంభవించిందని ప్రాథమిక విచారణలో తేలినట్లు అధికారులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వాహనాన్ని సీజ్ చేశారు. ప్రస్తుతం డ్రైవర్ పరారీలో ఉన్నాడు. గంగా నది పవిత్ర జలం కోసం కన్వరీలతో యాత్ర చేపట్టే శివుని భక్తులను కన్వరియాలు అంటారు. వీరు ఏటా కన్వరియాత్రలో పాల్గొంటారు.

బాలుడ్ని క్లాస్‌రూంలోనే బట్టలు విప్పించి వీడియో తీసిన ప్రిన్సిపాల్, వీడియోను సోషల్ మీడియాలో వైరల్‌ చేసిన కీచకుడు, తల్లిదండ్రుల ఫిర్యాదుతో జాబ్‌ నుంచి సస్పెన్షన్

మేఖ్లిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధార్లా బ్రిడ్జ్ వద్ద ఈ ఘటన జరిగినట్టు మఠభంగ అడిషనల్ ఎస్పీ అమిత్ వర్మ తెలిపారు. జనరేటర్ వైరింగ్ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేలిందన్నారు. కన్వారియాలందరూ శీతల్‌కుచి పోలీస్ పరిధిలోని ప్రాంతానికి చెందిన వారని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్టు తెలిపారు. వాహనాన్ని సీజ్ చేశామని, డ్రైవర్ పరారీలో ఉన్నాడన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..