What Is Interim Budget: మోదీ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్ట‌బోయే మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్ ప్ర‌త్యేక‌త‌లు ఇవే! అస‌లు మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్ అంటే ఏంటి? సాధార‌ణ బ‌డ్జెట్ తో పోలిస్తే తేడా ఏంటి?

కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టినప్పుడు ఈ బడ్జెట్ లో మార్పులు ఉండొచ్చు. పూర్తి బడ్జెట్ లో గతేడాది మొత్తం ఆదాయ, వ్యయ వివరాలను పొందుపరుస్తారు. వీటిని మధ్యంతర బడ్జెట్ లోనూ సమర్పించాల్సి ఉంటుంది. అయితే మధ్యంతర బడ్జెట్ లో ఎన్నికల వరకు మాత్రమే బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి

Representative Image (Photo Credit- ANI)

New Delhi, FEB 01: ప్రతి ఏటా ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెడతారు. అయతే ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టడం కుదరదు. అందుకే కొద్ది కాలానికి మాత్రమే బడ్జెట్ ను (Interim Budget) ప్రవేశపెడతారు. దీన్నే మధ్యంతర బడ్జెట్ (Interim Budget) అని అంటారు. ఎన్నికలకు ముందు ప్రవేశ పెడుతున్నారు కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని పిలుస్తారు. ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఏ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందో తెలియదు. దీంతో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు వ్యయం అంచనాలకు సంబంధించిన సమాచారాన్ని మధ్యంతర బడ్జెట్ (Interim Budget)లో పొందుపరుస్తారు. పూర్తి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వానికి సమయం లేనప్పుడు ఇలా మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెడతారు. పూర్తి బడ్జెట్ ను ప్రవేశపెట్టే సమయంలో వచ్చే ఆర్థిక సంవత్సరం మార్చి 31 వరకు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలకు కేటాయింపులు వంటి పూర్తి సమాచారం అందులో ఉంటుంది. పూర్తి బడ్జెట్ (Annual Budget) ప్రవేశపెట్టకపోతే మళ్లీ సంపూర్ణంగా బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు ప్రభుత్వ ఖర్చులకు పార్లమెంట్ ఆమోదం అవసరం అవుతుంది. అలా కొత్త బడ్జెట్ ప్రవేశ పెట్టే వరకు ఈ మధ్యంతర బడ్జెట్ ను పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది.

Interim Budget 2024: మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్ పై మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఆశ‌లు, ఆదాయ‌ప‌న్ను పెంపు కోసం ఎదురు చూస్తున్న సామాన్యులు, ఎన్నిక‌ల ముందు ప్ర‌వేశ‌పెట్ట‌బోయే బడ్జెట్ ప్ర‌త్యేక‌త‌లివే! 

కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టినప్పుడు ఈ బడ్జెట్ లో మార్పులు ఉండొచ్చు. పూర్తి బడ్జెట్ లో గతేడాది మొత్తం ఆదాయ, వ్యయ వివరాలను పొందుపరుస్తారు. వీటిని మధ్యంతర బడ్జెట్ లోనూ సమర్పించాల్సి ఉంటుంది. అయితే మధ్యంతర బడ్జెట్ లో ఎన్నికల వరకు మాత్రమే బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల వేళ ఓటర్లను ప్రభావితం చేసే పథకాలను మధ్యంతర బడ్జెట్ లో పెట్టేందుకు వీలు లేదు.

మధ్యంతర బడ్జెట్ లో కేటాయింపులకు ఆమోదం లభిస్తుంది కాబట్టి ఎన్నికల వరకు అయ్యే వ్యయాలను మాత్రమే ప్రభుత్వం బడ్జెట్ లో పొందుపరచాల్సి ఉంటుంది. నిధుల మంజూరుకు సంబంధించి ఆమోదం తెలియజేసేందుకు ఎలాంటి చర్చ అవసరం లేదు. అదే పూర్తి బడ్జెట్ అయితే చర్చ జరగాల్సి ఉంటుంది. ఇంటెరిమ్ బడ్జెట్ అనేది ప్రభుత్వ నిర్వహణ కోసం కల్పించిన ఒక రకమైన వెసులుబాటు.

అయితే, ఓట్ ఆన్ అకౌంట్ లో ప్రధాన పన్నులలో మార్పులు, విధాన సంస్కరణలు చేపట్టారు. నిజానికి భారత రాజ్యాంగంలో మధ్యంతర బడ్జెట్ అనే పదం పొందుపరిచింది లేదు. కాబట్టి, రెండుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ప్రభుత్వానికి ఉంది. 1962, 62లో మొరార్జీ దేశాయ్ మొదటిసారి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. 1997, 98లో రాజ్యాంగ సందిగ్దత ఏర్పడింది. ఆ సమయంలో ఐకే గుజ్రాల్ ప్రభుత్వం కూలిపోయింది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో పి.చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆయన బడ్జెట్ ప్రవేశ పెట్టగా, ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement